Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ నుంచి ఫావిపిరావిర్‌ ఔషధం యొక్క శక్తివంతమైన పిఫ్లూ (PiFLU), ఫావెంజా(FAVENZA)

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (19:51 IST)
దేశీయంగా వృద్ధి చెందిన ఫార్మా అగ్రగామి సంస్థ ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ నేడు తమ ఫావిపిరావిర్‌ బ్రాండ్ల యొక్క శక్తివంతమైన రకాలు- పిఫ్లూ మరియు ఫావెంజాను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది. భారతదేశంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు కోవిడ్‌-19 కేసులకు చికిత్సనందించేందుకు వీటిని వినియోగించవచ్చు. ప్రిస్ర్కిప్షన్‌ ఉన్న రోగులకు మాత్రమే వినియోగించే ఈ ఔషధాలు దేశవ్యాప్తంగా అన్ని వాణిజ్య మెడికల్‌ ఔట్‌లెట్లు, ఆస్పత్రిలలోని ఫార్మసీలలో నవంబర్‌ 01, 2020వ తేదీ నుంచి లభ్యమవుతాయి.
 
ఈ ఔషధాల యొక్క 800 ఎంజీ వెర్షన్స్‌తో రోగులు తీసుకునే మాత్రల సంఖ్య 75% వరకూ తగ్గుతుంది. ప్రస్తుతం రోగులు తమ చికిత్స మొదటి రోజు 18 మాత్రలను తీసుకుంటే అనంతరం 13 రోజులు పాటు 8 మాత్రలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.
 
ఈ అభివృద్ధి గురించి ఎఫ్‌డీసీ లిమిటెడ్‌ నుంచి శ్రీ మయాంక్‌ టిక్కా మాట్లాడుతూ, ‘‘ఆగస్టులో పిఫ్లూ మరియు ఫావెంజాలను విడుదల చేసిన తరువాత, మేము మోతాదు ఫ్రీక్వెన్సీని తగ్గించడంపై పనిచేయాలని, అలాగే ఖర్చునూ తగ్గించాలని నిర్ణయించాం. ఈ ఫలితంగానే మేము ఈ నూతన వేరియంట్‌లను విడుదల చేయగలిగాం.
 
పిఫ్లూ-800 మరియు ఫావెంజా 800లు రోగులకు చికిత్స ఖర్చును 30% తగ్గించడంతో పాటుగా అదే సమయంలో చికిత్స యొక్క సామర్థ్యంనూ వృద్ధి చేస్తుంది. ఇది జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చడంతో పాటుగా ఫ్యామిలీ ఫిజీషియన్ల చేత కూడా ఈ చికిత్సను పొందడం వల్ల హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్న రోగులకు ఖర్చును సైతం తగ్గిస్తుంది’’ అని అన్నారు.
 
డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) అనుమతించిన ఫావిపిరావిర్‌, విస్తృతశ్రేణిలోని యాంటీ వైరల్‌ ఏజెంట్‌ మరియు ఇన్‌ఫ్లూయెంజా, సార్స్‌కోవ్-2 వైరస్‌ల యొక్క ఆర్‌ఎన్‌ఏ పాలిమరేస్‌ను అడ్డుకుంటుంది మరియు వైరల్‌ ప్రతిరూపకల్పనను నిరోధిస్తుంది. కోవిడ్‌-19 తీవ్రం కావడం మరియు క్లిష్టతరంగా మారడాన్ని ఫావెంజా మరియు పిఫ్లూ ఔషదాలు 10వ రోజు నాటికి 92.5% తగ్గించడంతో పాటుగా 5వ రోజు నాటికి 62.5% తగ్గిస్తాయి. అంతేకాదు 15వ రోజు నాటికి రోగి యొక్క ఛాతీ సీటీ స్కోర్‌ 90% వరకూ వృద్ధి చెందుతుంది.
 
ఈ ఓరల్‌ యాంటీ వైరల్‌ ఔషధం వైరల్‌ రెప్లికేషన్‌ సైకిల్‌ను తగ్గించడంతో పాటుగా తేలికపాటి నుంచి మోస్తరు లక్షణాలు కలిగిన కోవిడ్‌-19 రోగులు వేగంగా కోలుకునేందుకు సహాయపడుతుంది. ఈ తరహా ఆవిష్కరణలతో కోవిడ్-19తో పోరాటంలో భారతదేశం తరపున ఎఫ్‌డీసీ తన పోరాటం కొనసాగిస్తుంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments