Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపవాసంతో ఆయువు పెరుగుతుంది... తెలుసా?

చాలామంది తరచూ ఉపవాసం ఉంటుంటారు. ఇలాంటివారికి ఆయువు పెరుగుతుందని గుర్తించారు హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా నెట్‌వర్క్‌ల చర్యలను మార్చడం ద్వారా ఉపవాసం ఆయువును పెంచడంతో పాటు ఆరోగ్యాన

Webdunia
బుధవారం, 8 నవంబరు 2017 (10:18 IST)
చాలామంది తరచూ ఉపవాసం ఉంటుంటారు. ఇలాంటివారికి ఆయువు పెరుగుతుందని గుర్తించారు హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు. కణాల్లోని మైటోకాండ్రియా నెట్‌వర్క్‌ల చర్యలను మార్చడం ద్వారా ఉపవాసం ఆయువును పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రయోగపూర్వకంగా గుర్తించారు. ఈ మైటోకాండ్రియా అనే కణాలకు అవసరమైన శక్తిని తయారు చేసే గుణం ఉంటుందని తెలిపారు. 
 
ఈ ప్రయోగాన్ని హార్వర్డ్‌ శాస్త్రవేత్తలు నులిపురుగులపై చేశారు. రెండు వారాల పాటే బతికే ఈ నులిపురుగులకు అందే ఆహారాన్ని నియంత్రించినప్పుడు వేర్వేరు కణాల్లోని మైటోకాండ్రియాలు స్థిరంగా ఉండిపోయినట్లు గుర్తించారు. సాధారణ పరిస్థితుల్లో మైటోకాండ్రియా ఒక దశ నుంచి ఇంకోదశకు సులువుగా మారేందుకు ఈ ప్రక్రియ వీలు కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. 
 
అంతేకాకుండా ఉపవాసం కారణంగా మైటోకాండ్రియా.. ఆక్సిజన్‌ సాయంతో కొవ్వులను మండించే భాగాలైన పెరాక్సీసోమ్స్‌ మధ్య సమన్వయం కూడా పెరిగిందని తెలిసింది. ఈ ప్రయోగంతో ఉపవాసం వల్ల శరీరంలో పేర్కొని పోయిన కొవ్వులను (కొలస్టాల్‌ను) మైటోకాండ్రియా కణాలు కరిగించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆయువు కూడా పెరుగుతుందని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments