Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేదిక్‌ జెల్‌ క్విట్‌పెయిన్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసిన దక్కన్‌ హెల్త్‌కేర్‌

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (17:52 IST)
దక్కన్‌ హెల్త్‌కేర్‌ నేడు హైదరాబాద్‌లో తక్షణమే నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఆయుర్వేదిక్‌ జెల్‌, క్విట్‌ పెయిన్‌ను విడుదల చేసింది. సుప్రసిద్ధ న్యూట్రాస్యూటికల్‌, కాస్మెస్యూటికల్‌ ప్రొడక్ట్స్‌ కంపెనీ దక్కన్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ యొక్క యాజమాన్య మిశ్రమం ఇది. నొప్పుల నుంచి ఉపశమనం కోసం అతి సులభంగా వినియోగించతగిన ఆయుర్వేదిక్‌ నొప్పి నివారణ జెల్‌‌గా తోడ్పడుతుంది.
 
క్విట్‌ పెయిన్‌లో అత్యున్నత సామర్ధ్యం కలిగిన జెల్‌ ఉంది. ఒక కీలు ప్రాంతంలో నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇది సరిపోతుంది. ఇది తొమ్మిది రకాల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిలో వెన్ను నొప్పి, మెడ, మణికట్టు, చీలమండలం, తుంటి, భుజం, మోకీలు మరియు మోచేయి  ఉన్నాయి. అంతేకాదు కండరాల నొప్పులు, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు మరియు బెణకడం వంటి సమస్యల నుంచి కూడా ఇది ఉపశమనం కలిగిస్తుంది. దక్కన్‌ హెల్త్‌కేర్‌ ఇటీవలనే  సోషల్‌ మీడియా క్యాంపెయిన్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. తద్వారా ఉత్పత్తికి తగిన విజిబిలిటీ, ప్రచారం కల్పిస్తుంది.
 
ఈ అభివృద్ధి గురించి దక్కన్‌ హెల్త్‌కేర్‌ ఛైర్మన్‌- మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మింటో పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ ‘‘క్విట్‌ పెయిన్‌ పవర్‌ జెల్‌ను వేగవంతంగా ఉపశమనం అందించేందుకు తీర్చిదిద్దడం జరిగింది. నొప్పులు, కండరాలు పట్టేయడం వంటి వాటి నుంచి వేగవంతంగా ఉపశమనం కలిగిస్తుంది. సహజసిద్ధమైన పదార్థాలతో ఇది తయారుచేయబడటం వల్ల, నొప్పులు మరియు వాపు నుంచి దీర్ఘకాలిక ఉపశమనం ఇది అందిస్తుంది. పురాతన భారతీ ఆయుర్వేద విజ్ఞానం, సమకాలీన శాస్త్రీయ పరిశోధనలను అత్యుత్తమంగా మిళితం చేసిన ఒక శక్తివంతమైన ప్యాక్డ్‌ జెల్‌గా దీనిని అందిస్తున్నాము’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments