నందమూరి కళ్యాణ్ రామ్ భిన్నమైన కథలతో సినిమారంగంలో ప్రవేశించాడు. ఆ ప్రయోగాలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టాయి. తాజాగా ఆయన నటించిన బింబిసార చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఓటీటీలోనూ ఆదరణ పొందింది. ఈ సందర్భంగా కళ్యాణ్‌రామ్ ఆడియన్స్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లెటర్ రాశారు. మా బేనర్‌లో వచ్చిన బింబిసారకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మా అభిరుచికి మీరు జేజేలు పలికారు. సినిమారంగంలో హిట్ వస్తే అది నాడి కాదు. యావత్ సినిరంగం విజయం అంటూ పేర్కొన్నారు.
ఇదిలా వుండగా, తన సోషల్ మీడియాలో తను చేస్తున్న కొత్త సినిమా అమిగోస్లో కొత్త లుక్‌తో కనిపిస్తూ స్టిల్ పోస్ట్ చేశారు. ఈ పాత్ర సినిమాలో సరికొత్తగా వుండబోతుందని తెలుస్తోంది. ఇందులో కళ్యాణ్ రామ్‌ను మునుపెన్నడూ చూడని గెటప్‌లో చూడనున్నారు ప్రేక్షకులు. కాగా, ఈ సినిమా టీజర్ జనవరి 8న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మైత్రీమూవీస్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఫిబ్రవరి 18న థియేటర్‌లో విడుదలకాబోతోంది.