Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ గుప్పెడు బాదములతో క్రిస్‌మస్‌ను వేడుక చేసుకోండి

Webdunia
గురువారం, 16 డిశెంబరు 2021 (22:31 IST)
వాతావరణం చల్లబడటమే కాదు ధర్మామీటర్‌లో పాదరసం అట్టడుగు స్థాయిలకు చేరుతున్న శీతాకాలం వచ్చింది.  సాయంత్రపు సమయం పెరిగింది. చల్లగాలులు వీస్తున్నాయి. సంతోషం, ప్రేమానుభూతులూ పొంగుకొస్తున్నాయి. సంతోషకరమైన క్రిస్మస్‌ సంబరాలకు వేళయింది. ప్రపంచంలో పలు ప్రాంతాలలో క్రిస్మస్‌ను వైవిధ్యంగా వేడుక చేసుకుంటున్నారు. అయితే ఆ పండుగ స్ఫూర్తి మాత్రం అన్ని చోట్లా ఒకేలా కనిపిస్తుంది.

 
పండుగ అంటేనే అందరూ ఒకే దరికి రావడం, బహుమతులను ఇచ్చి పుచ్చుకోవడం, సంతోషాలను వేడుక చేసుకోవడం కనిపిస్తుంటుంది. ఇంటిని అత్యంత అందంగా ప్రకాశవంతమైన దీపాలతో అలంకరించు కోవడమే కాదు, క్రిస్మస్‌ ట్రీలతో మరింత ఆకర్షణీయంగా మారుస్తారు. ప్రియమైన వారికి బహుమతులు అందించడమూ జరుగుతుంది.

 
పసందైన రుచుల ప్రయాణంలో ప్రజలు మునిగి తేలేందుకు అత్యంత అనువైన సమయం క్రిస్మస్‌. కుటుంబ సభ్యులు, స్నేహితులతో విలాసవంతమైన విందు, వైవిధ్యమైన తియ్యందనాల రుచుల ఆస్వాదన కూడా జరుగుతుంటుంది. అయితే, ఈ బహుళ పార్టీలు, విందులతో సంతోషించడమన్నది కుటుంబ ఆరోగ్యం దృష్ట్యా మంచిది కాదు. కానీ ఈ సంతోషపు సంబరాలను ఆరోగ్యంగా మలుచుకోవాలంటే మాత్రం పోషకాలతో కూడిన ఆహారాన్ని క్రిస్మస్‌ వేడుకలకు జోడించుకోవడమే! 

 
ఆ తరహా ఆహారంలో అత్యుత్తమ ఉదాహరణ బాదములు. అవి మన ఆకలిని తీర్చడం మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అదనంగా, చక్కటి ఆరోగ్యానికి ఉత్తమ బహుమతిగా కూడా అవి గుర్తించబడ్డాయి. అవి గుండెఆరోగ్యంకు మేలు చేయడంతో పాటుగా మధుమేహం, బరువు నిర్వహణలోనూ తోడ్పడుతున్నాయి. పూర్తి వైవిధ్యమైన బహుమతి బాదములు. వాటిని వైవిధ్యమైన రీతులలో, ప్లెయిన్‌, రోస్టెడ్‌ లేదా ఫ్లేవర్డ్‌గా రోజులో ఏ సమయంలో అయినా వినియోగించవచ్చు. అందువల్ల, మీ అతిథులకు వీటితో విందు చేయడం మాత్రమే కాదు, ఈ క్రిస్మస్‌ వేళ మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు బాదములను బహుమతిగా అందించండి.

 
అనారోగ్యవంతమైన ఆహారానికి బదులుగా ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవడంపై సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి సోహా అలీఖాన్‌ మాట్లాడుతూ, ‘‘నా వరకూ క్రిస్మస్‌ అంటే స్నేహితులతో అద్భుతమైన సమయం గడపటంతో పాటుగా బహుమతులను పంచుకోవడం. ఈ సంవత్సరం, నేను ఆలోచనాత్మక  బహుమతులను ప్రణాళిక చేశాను. ఇవి  నా స్నేహితులు, కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి మరింత ఆనందం జోడించనున్నాయి. ఈ  బహుమతులలో బాదములు అత్యున్నతంగా ఉంటాయి. బాదములతో రెండు రకాల ప్రయోజనాలున్నాయి. అవి అత్యంత రుచికరమైన స్నాక్‌గా నిలువడంతో పాటుగా ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమైన పోషకాలు కలిగి ఉన్నాయి. ఈ కారణం చేతనే ఇవి అత్యుత్తమ బహుమతిగా నిలుస్తాయి’’ అని అన్నారు.

 
సుప్రసిద్ధ ఫిట్‌నెస్‌, సెలబ్రిటీ ఇన్‌స్ట్రక్టర్‌ యాస్మిన్‌ కరాచీవాలా మాట్లాడుతూ, ‘‘చాలామందికి క్రిస్మస్‌ అనగానే వారం పాటు విందు వినోదాలలో తేలిపోవడమే. పసందైన రుచుల ఆస్వాదనతో చాలామంది ఉత్సాహంగా గడుపుతుంటారు. ఈ కారణంగా బరువు పెరగడమూ కనిపిస్తుంది. ఈ పండుగల వేళ ఈ విధానం మార్చుకోవడంతో పాటుగా ఆరోగ్యవంతమైన ఆహారం అయినటువంటి బాదములు లాంటి వాటిని అందించాల్సి ఉంది. వీటిని పార్టీల సమయంలో తయారుచేసే డిష్‌లలో ఉపయోగించడం లేదా ఏ సమయంలో అయినా స్నాక్‌గా వాడవచ్చు.

 
బాదములకు ఆకలి తీర్చే గుణాలు ఉన్నాయి. ఇవి శక్తినీ అందిస్తాయి. దీనికి తోడు భారతదేశంతో పాటుగా అంతర్జాతీయంగా చేసిన అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ప్రతి రోజూ బాదములు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడి, బరువు నియంత్రించడమూ సాధ్యపడుతుంది. టైప్‌ 2 మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రియమైన వారితో పంచుకునేందుకు అత్యుత్తమ బహుమతిగా ఇది నిలుస్తుంది’’అని అన్నారు.

 
న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ, ‘‘క్రిస్మస్‌తో పాటుగా సంవత్సరాంతంలో మనలో చాలామంది ఎలాంటి సంకోచం లేకుండా స్వీట్లు తింటుంటారు. సాధారణంగా వీటిని ప్రియమైన వారు బహుమతులుగా అందిస్తుంటారు. గిఫ్టింగ్‌ పట్ల మన ఆలోచనా ధోరణి మార్చుకోవడం ద్వారా ఈ విధానం కూడా మార్చుకోవాలి. ఈ సంవత్సరం ఆరోగ్యవంతమైన ఆహారం అయినటువంటి బాదములు వంటివి పోషకాహార, ప్రయోజనకరమైన ఎంపికలుగా  నిలుస్తాయి.

 
వాస్తవానికి, అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం ప్రతి రోజూ 42 గ్రాముల బాదములను తింటే, అది నడుం దగ్గర కొవ్వు తగ్గించడంతో పాటుగా గుండె వ్యాధుల ప్రమాదమూ తగ్గిస్తాయి’’ అని అన్నారు. అందువల్ల, ఈ క్రిస్మస్‌ను మరింత సంతోషంగా కరకరలాడే మరియు పోషకాలతో కూడిన బాదములను మీ ఫ్యామిలీ డైట్‌లో భాగం చేసుకోండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

నీ భార్యను నాకు ఇచ్చేయ్.. పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటా.. భర్తను కోరిన వ్యక్తి.. చివరికి?

Perfume Day 2025: పెర్ఫ్యూమ్‌ డే.. వ్యక్తిగత గుర్తింపు కోసం సిగ్నేచర్ సెంట్‌

ఆన్‌లైన్ బెట్టింగుతో నష్టపోయా, చనిపోతున్నా క్షమించు తమ్ముడూ సెల్ఫీ(video)

కేసీఆర్ పుట్టిన రోజు : ఫ్లెక్సీలను తొలగించండి.. (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

తర్వాతి కథనం
Show comments