Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్కిన్సన్ వ్యాధి హాట్‌స్పాట్‌గా భారత్.. అందుబాటులో సరికొత్త చికిత్స

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (19:50 IST)
భారత్ పార్కిన్సన్ వ్యాధికి కేంద్ర బిందువుగా మారుతోందని చెన్నై మహానగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన వెస్ట్‌మినిస్టర్ ఆస్పత్రి వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం భారత్‌లో 5,80,000 మంది పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ఆ బృందం తెలిపింది. ఇది వచ్చే 2030 నాటికి రెట్టింపు అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
ఇదే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లోని మూవ్‌మెంట్ డిజార్డర్స్, పార్కిన్సన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ డాక్టర్ వినోద్ మెట్టా, చెన్నై వెస్ట్‌మినిస్టర్ ఆస్పత్రి సెలెరా న్యూరో సైన్సెస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబూ నారాయణన్‌లు మాట్లాడుతూ, వెస్ట్‌మిన్‌స్టర్ హాస్పిటల్‌లో డి-మైన్ పంపులు, పెన్నుల (సిరంజ్) టైప్ చికిత్సా విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. 'అపోమోర్ఫిన్ థెరపీ ఆఫ్ పీరియడ్స్‌లో మందులు తీసుకునే సమయంలో ఉపశమనం ఇస్తుందని, కొద్ది రోజుల తర్వాత అవి సరిగా పని చేయడం లేదన్నారు. ఫలితంగా, రోగుల్లో వణుకు, పటుత్వం కోల్పోవడం, ఆందోళన చెందడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. 
 
'ఐరోపాలో విస్తృతంగా ఉపయోగించే ప్రపంచ-స్థాయి అపోమోర్ఫిన్ థెరపీని చెన్నైలోని రోగులకు డి-మైన్ పంపులు, సిరంజ్‌ల ద్వారా అందించే చికిత్సా విధానాన్ని ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. వణుకుతున్న చేతులతో చేయడం కష్టం అయిన అపోమోర్ఫిన్ యొక్క ఆంపుల్స్‌ను విచ్ఛిన్నం చేసిన తర్వాత రోగులు వాటిని రీఫిల్ చేయాలి. దీనికి విరుద్ధంగా, డి-మైన్ అపోమోర్ఫిన్ పంపులను ఐదు సులభమైన దశల్లో రోగులు స్వయంగా వాడుకోవచ్చని తెలిపారు. 
 
రోగులలో ఎక్కువ మంది 50 ఏళ్లు పైబడిన వారే అయినప్పటికీ, యువ జనాభాలో కూడా సమస్య పెరుగుతుందన్నారు. దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం పడేలా పార్కిన్సన్స్ ఒక పెద్ద నాన్-కమ్యూనికేబుల్ డిజెనరేటివ్ డిజార్డర్‌గా ఉద్భవించడానికి ఆస్కారాలు ఉన్నాయని చెప్పారు. 
 
అయితే, చెన్నైలోని పార్కిన్సన్స్ డిసీజ్ రోగులకు ఒక వరంలా, జర్మన్ ఫార్మా మేజర్ ఎవర్ ఫార్మా తయారు చేసిన అధునాతన డి-మైన్ అపోమోర్ఫిన్ పంపులు మరియు పెన్నులు (ఇంజెక్షన్లు) సెలెరా న్యూరో సైన్సెస్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఐరోపాలో విస్తృతంగా ఉపయోగించే ఈ థర్డ్ జనరేషన్ అపోమోర్ఫిన్-డెలివరీ పరికరాలు ఇప్పుడు వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్‌లోని రోగులకు అందుబాటులో ఉన్నాయి.
 
సెలెరా న్యూరో సైన్సెస్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బాబూ నారాయణన్ మాట్లాడుతూ, పార్కిన్సన్స్ రోగులకు ఆధునిక యూరోపియన్ అపోమోర్ఫిన్ పరికరాలు అందుబాటులో ఉండటం భారతదేశంలో ఇదే మొదటిసారని, అందులోనూ చెన్నైలో అందుబాటులోకి తీసుకుని రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

పని పురుగులా మారిపోయా, నా ముక్కు నుంచి రక్తం పడింది: బెంగళూరు CEO

సీఎం మమతకు షాకిచ్చిన సుప్రీంకోర్టు - 25 వేల టీచర్ నియామకాలు రద్దు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

టిల్లు సిరీస్‌లా జాక్ సిరీస్‌కు ప్లాన్ చేసిన దర్శకుడు భాస్కర్

తర్వాతి కథనం
Show comments