Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరటి పండు-పాలు రెండూ కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (22:17 IST)
పాలు తాగేవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. అంటే... పాలు తాగేటపుడు దానితో కలిపి తీసుకునే ఇతర పదార్థాల గురించే. పాలు ఎలా తీసుకోవాలనే దానిపై కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటంటే.. చాలామంది ఉదయం వేళ పాలు, అరటిపండు తీసుకుంటుంటారు. పాలతోగాని, పెరుగుతోగాని, పాలపొడితో గాని అరటి పండును తీసుకోవడం సరికాదు. 
 
చాలామంది భోజనం తర్వాత అరటిపండు తీసుకుంటారు. ఇది కూడా సరికాదు. అరటి పండును తినాలనుకునేవారు భోజనానికి ముందే తీసుకోవాలి లేదా మధ్యాహ్న భోజనం తర్వాత సాయంత్రం నాలుగ్గంటల ప్రాంతంలో కడుపు కాస్త ఖాళీ అయ్యాక తీసుకోవడం మంచిది. 
 
రోజూ పాలు తాగేవారు దానితో తీపి పదార్థాలు తప్ప మరే రుచినీ కలపకూడదు. కాబట్టి టీ, కాఫీలు తాగేవారు కేవలం వాటిని కషాయంగా (పాలు కలపకుండా) తాగడమే ఆరోగ్యానికి మంచిది. ఇక ముఖ్యంగా పాలతో ఉప్పు కలపడం ఆరోగ్యానికి అనర్థం. అందుకే పాలతో కలపి సాల్ట్ బిస్కెట్లు తీసుకోవడం మంచిది కాదని గమనించండి. 
 
కొందరు కొన్ని రకాల కూరల్లో పాలు కలిపి వండుతుంటారు. పాలలో ఉప్పు కలిపి వండటం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదని గమనించండి. ఇది హానికరం. ఇక పాలు, పనసపండు కలిపి తినకూడదు. పాలు, చేపలు కలిపి తినకూడదు. చేపలు తిన్న తర్వాత మజ్జిగ గాని, పెరుగు గాని తింటే దీర్ఘకాల రోగాలు తప్పవు. పెరుగును ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి చేయకూడదు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments