Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందంగా, ఆరోగ్యంగా కనబడాలంటే ఎలాంటి పదార్థాలు తీసుకోవాలి?

Webdunia
సోమవారం, 18 మార్చి 2019 (20:53 IST)
ఆరోగ్యకర, సమతుల్య ఆహరాలను తీసుకోవటం వలన చర్మానికి కావలసిన పోషకాలు అందించబడి, ఆరోగ్యంగా మరియు అందంగా కనపడతారు. మృదువైన చర్మం, నునుపైన జుట్టు, ప్రకాశవంతమైన కళ్ళు, స్లిమ్‌గా కనపడటానికి మరియు తేజస్సుతో మెరిసేలా కనపడటానికి మనం తినే ఆహార పదార్థాలే కారణమవుతాయి.
 
మనం తినే ఆహరంలో విటమిన్ మరియు మినరల్స్ లోపం వలన, త్వరగా చర్మంపై ముడతలు కలుగుతాయని పరిశోధనలలో వెల్లడించబడింది. విటమిన్ సి ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం వలన, శరీర రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడి, వయసు మీరటం వలన కలిగే చర్మ సమస్యలను ఆలస్యం చేస్తాయి. అంతేకాకుండా, ఇవి చర్మ కణాలలో, కొల్లజన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించి, చర్మం అందంగా కనపడేలా చేస్తాయి. నూతన చర్మ కణాలు ఏర్పడటానికి, విటమిన్ బి అత్యవసరం అని చెప్పవచ్చు. వీటితో పాటుగా, విటమిన్ ఎ మరియు ఇ లు చర్మం మృదువుగా మరియు చర్మ రూపును ఆరోగ్యకరంగా ఉంచుతాయి.
 
మలబద్దకం వలన శరీరంలో హానికర కారకాలు నిండిపోయి, ఇవి చర్మం ద్వారా భయటకి పంపటానికి, శరీర కణాలు ప్రయత్నిస్తాయి, ఫలితంగా, చర్మంపై మొటిమలు ఏర్పడతాయి. మీరు జిడ్డు చర్మాన్ని కలిగి ఉంటె మాత్రం, వీటి వలన నల్లటి మచ్చలు, వలయాలు, మొటిమలు కలుగుతాయి. కావున, మీరు ఆహారంలో ఎక్కువ శాతం ఫైబర్ ఉండేలా చూసుకోండి. చక్కెరలు, పిండిపదార్థాలు మరియు నూనె ఆధారిత ఆహార పదార్థాలకు బదులుగా, పచ్చి కూరగాయలు, తాజా పండ్లు, సలాడ్ మరియు మొలకలు ఉన్న ఆహార పదార్థాలను తినండి. 
 
పండ్ల రసం, హోల్ గ్రైన్స్ మరియు అధిక మొత్తంలో నీటిని తాగటం తాగండి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థను శుభ్రపరుచుకోవడానికి ప్రతిరోజు ఉదయం పరగడుపున గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఈ నెల 24 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

అత్యాచారం చేసి స్క్రూడ్రైవర్‌తో ప్రియురాలిని హత్య చేశాడు.. నిందితుడికి జీవిత ఖైదు

కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆసక్తికర పరిణామం : కుమార్తె కవిత ఇంటికి వెళ్లిన తల్లి శోభ

AP Ration Cards: ఏటీఎం కార్డులను పోలిన స్మార్ట్ రేషన్ కార్డులు

మెగా డీఎస్సీకి మెలిక పెట్టిన విద్యాశాఖ.. భర్త పేరుపైనే ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలు ఉండాలి...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai Review: తేజ సజ్జ, మంచు మనోజ్ ల మిరాయ్ చిత్రంతో అనుకుంది సాధించారా.. రివ్యూ

Jabardasth Comedian: వైల్డ్ కార్డ్ ఎంట్రీ- బిగ్‌బాస్ జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది

ఫిల్మ్‌ఫేర్ గ్లామర్- స్టైల్ అవార్డ్స్ 2025తో బ్లెండర్స్ ప్రైడ్

Emraan Hashmi: పవన్ కళ్యాణ్ ఓజీ నుండి థమన్ స్వరపరిచిన ఓమి ట్రాన్స్ విడుదల

Tej sajja: చిరంజీవి, కరణ్ జోహార్, నాని గారి కాంప్లిమెంట్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments