Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒమిక్రాన్ సోకితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (19:18 IST)
ఇపుడు దాదాపు ఒమిక్రాన్ వేరియంట్ ప్రతి ఒక్కరినీ పట్టుకుంటోంది. ఈ వైరస్ దెబ్బకి వళ్లంతా కుళ్లబొడిచిన ఫీలింగ్. విపరీతమైన జ్వరం, పొడిదగ్గు. ఐతే ఈ లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తున్నాయి. ఇదిలావుంటే.. ఒమిక్రాన్ బారిన పడినవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలన్న సందేహం ఎక్కువగా వుంటుంది.

 
ఒమిక్రాన్ లక్షణాలను తగ్గించడానికి కొన్ని ఆహారాలు సహాయపడతాయి. గొంతు నొప్పిని తగ్గించగలవి సూప్‌లు. మింగడం కష్టంగా ఉన్నప్పుడు ఖిచ్డీ లేదా సూప్‌ల వంటి మృదువైన ఆహార పదార్థాలను ఇవ్వవచ్చు. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరి వంటి పండ్లను రోజూ తీసుకోవచ్చు. కొబ్బరి నీరు, అరటిపండ్లు ఇవ్వవచ్చు.

 
ప్రోటీన్ ఆహారం కోసం గుడ్లు, పెరుగు, పాలు, పనీర్, చికెన్, చేపలు, పప్పులు తీసుకోవచ్చు. విటమిన్ సి కోసం ఉసిరి, నిమ్మ, నారింజ, జామ మొదలైనవి తినవచ్చు. జింక్ సప్లిమెంట్ల కోసం జీడిపప్పు, గుడ్డు, పాలకూర, పప్పు, పాలు తీసుకోవాలి. కొవ్వుల కోసం వాల్‌నట్‌లు, కొవ్వు చేపలు, అవిసె గింజలు వంటివి తీసుకోవాలి.


శరీరాన్ని మంచి హైడ్రేటెడ్ స్థితిలో మనల్ని మనం కాపాడుకోవడానికి రోజుకు 2-3 లీటర్ల నీటిని తాగుతూ వుండాలి. ఇలా తీసుకుంటూ వుంటే... శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతమై ఒమిక్రాన్ బారిన పడినా బయటపడవచ్చు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments