Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిన్నది అరగటంలేదు, ఒకటే త్రేన్పులు, ఎందుకని?

Webdunia
శుక్రవారం, 4 మార్చి 2022 (00:03 IST)
అసిడిటీతో గుండెల్లో మంట ఏర్పడుతుంది. ఫలితంగా తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. అన్నం తిన్న వెంటనే కడుపు ఉబ్బరంగానూ, త్రేన్పులు వస్తుంటాయి. ఈ అసిడిటీకి గల కారణాలు ఏమిటో చూద్దాం. సరిగా నిద్ర లేకపోవడం ఒకటైతే తీసుకునే ఆహారాన్ని త్వరగా భుజించడం, సరిగా నమిలి తినకపోవడం మరో కారణం.

 
అలాగే తీసుకునే ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం. ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం. తీసుకునే ఆహారం మోతాదుకి మించి ఎక్కువగా తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా ఉండదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది. అలాగే సమయానికి భోజనం చేయకపోవడం కూడా ఎసిడిటీకి దారి తీస్తుంది.

 
అసడిటీ అదుపు చేసేందుకు చిట్కాలు
అసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతి రోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూస్, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.

 
తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించాలి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాకొలేట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ను తగుమోతాదులో తీసుకోవాలి.

 
తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఇలా వుంటే ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. భోజనం తీసుకున్న వెంటనే నిద్ర పోకూడదు. మద్యపానం, ధూమపానం అలవాటుకి దూరంగా వుండాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

తర్వాతి కథనం
Show comments