Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెకు తులసి, అల్లం ఎంత మంచిదో తెలుసా?

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (18:07 IST)
శరీరానికి సరైన వ్యాయామం లేక చాలా మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు. ఎక్కువ సేపు కూర్చుని పని చేయడం వల్ల కూడా ఊబకాయం వస్తుంది. దీనికి ప్రధాన కారణం శరీరంలో కొవ్వు పేరుకుపోవడం. తత్ఫలితంగా గుండె సమస్యలు కూడా తలెత్తుతాయి. ప్రస్తుత కాలంలో తక్కువ వయస్సు వారికి కూడా గుండె సమస్యలు వస్తున్నాయి. 
 
ఈ రోజుల్లో అత్యధిక మరణాలు గుండె వ్యాధుల వలనే ఉంటున్నాయి. అసలు గుండెకు వచ్చే సమస్యలకు రక్త సరఫరాలో వచ్చే అవరోధాలే ఎక్కువట. గుండెకు సరిగ్గా రక్త సరఫరా లేకపోవడం, నరాల్లో కొవ్వు అడ్డంగా పేరుకుపోవడం వంటి వాటితో గుండెకు ముప్పు వాటిల్లుతోంది. గుండెల్లో నొప్పి, గుండె పట్టేసినట్టు ఉండడం వంటివి రాబోయే తీవ్ర అనారోగ్యాలకు సూచికలు. 
 
కొన్ని ఆయుర్వేద చిట్కాలు పాటించడం ద్వారా మనం వీటిని దూరం చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల్ని జ్యూస్‌గా చేసి గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని రోజూ ఒక చెంచా చొప్పున నీటిలో కలుపుకుని పరగడుపున త్రాగితే రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తున్నట్లయితే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. 
 
ఆయుష్షు కూడా పెరుగుతుంది. రోజూ రెండు మూడు పచ్చి వెల్లుల్లి రెబ్బల్ని తిన్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉసిరికాయ పొడిలో కొద్దిగా తేనె లేదా పంచదార కలిపి నీటితో తీసుకుంటే కూడా గుండె వ్యాధులు రాకుండా చేసుకోవచ్చు. నీటిలో తులసి ఆకుల రసం, తేనె కలుపుకుని తాగినా గుండె వ్యాధులను దూరం చేసుకోవచ్చు. రోజూ 4 తులసి ఆకులు నమిలి తిన్నా కూడా గుండె చక్కగా పనిచేస్తుంది. 
 
వాపులు, గుండె జబ్బులు నివారించడంలో తులసి ఎంతో ఉత్తమంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండే చెడు కొవ్వును తగ్గిస్తుంది. తులసిని ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా చెబుతారు. బరువు తగ్గాలనుకునే వారు మజ్జిగలో తులసి ఆకులను వేసి త్రాగాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అలాంటి రోగులకు కర్నాటకలో గౌరవంగా చనిపోయే హక్కు!!

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

తర్వాతి కథనం
Show comments