Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురుషులకు పొన్నగంటి కూర ఎందుకు? (video)

Webdunia
మంగళవారం, 20 ఆగస్టు 2019 (15:59 IST)
ఆకుకూరలు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. పోషకాలు అందించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. అందులో పొన్నగంటికూరది ప్రత్యేక స్థానం. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కంటి చూపు మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా పురుషులలో వీర్య వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది, లైంగిక సమస్యలను నివారిస్తుంది. 
 
పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను సరిచేస్తుంది. అంతే కాకుండా కొన్ని రకాల వ్యాధులకు మందుగా పనిచేస్తుంది. టేబుల్‌ స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయి. నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది. వైరస్, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది. 
 
మధుమేహంతో బాధపడేవారిలో పొన్నగంటి కూర కణజాలం దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది. అందుకే ఇతర మందులతో పాటుగా ఆహారంలో దీన్ని క్రమంతప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. వీర్యకణాల లోపం వల్ల సంతాన సమస్య తలెత్తుతుంది. ఆ సమస్యను నివారించుకోవడానికి పొన్నగంటి కూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. 
 
మొలల వ్యాధిని కూడా ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవు నెయ్యితో వండుకుని తింటే మంచిదట. రెండు టేబుల్‌ స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం