Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుచ్చకాయ వచ్చేసింది.. అందులో ఏమున్నదంటే...

Webdunia
శనివారం, 23 ఫిబ్రవరి 2019 (21:24 IST)
పుచ్చపండు గురించి దాదాపు అందరికి తెలిసిందే. తాజా భావనకు గురిచేసే, పోషకాలను కలిగి ఉండే ఈ పండులో వీటి విత్తనాలు కూడా చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. వీటి గింజలు ఐరన్, పొటాషియం మరియు విటమిన్ల‌తో నిండి ఉంటాయి. పుచ్చపండుతో పాటు గింజలను తినడం వలన అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. పుచ్చపండులో గల పోషక విలువలేమిటో చూద్దాం.
 
1. అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలను పుచ్చకాయ తగ్గిస్తుంది. జ్వరంతో బాధపడతున్నవారు పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది.
 
2. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది.
 
3. పుచ్చకాయలో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. పుచ్చపండు గింజలు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనపడేలా చేస్తాయి. అంతేకాకుండా, ఈ విత్తనాలను తీసుకోవటం వలన చర్మ క్యాన్సర్ మరియు ఇన్ఫెక్షన్ వంటి చర్మ రుగ్మతలకు దూరంగా ఉంచుతుంది.
 
4. పుచ్చకాయ తినడం వలన మగవారిలో స్తంభన సమస్యలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. పుచ్చకాయలోని సిట్రులైన్, ఆర్గినైన్ పదార్దాల వలన ఈ సమస్య తగ్గుతుంది.  
 
5. ఈ కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. బి విటమిన్లు , పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి. బి విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే.. పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. 
 
6. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్‌ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. పుచ్చపండు గింజలు మెగ్నీషియంను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ మూలకం గుండె విధిని మరియు రక్త పీడనాన్ని సమతుల్య పరుస్తుంది. ఇవే కాకుండా గుండె సంబంధిత వ్యాధులు, హైపర్ టెన్షన్‌లను తగ్గించి, జీవక్రియకు సజావుగా జరుగుటలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Devaansh: నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ అదుర్స్.. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం (video)

సినీ ఇండస్ట్రీ ఏపీకి వస్తే బాగుంటుంది.. పవన్ చెప్పారు.. పల్లా శ్రీనివాస్

Hyderabad : కూతుర్ని కిడ్నాప్ చేశాడు.. ఆటో డ్రైవర్‌ను హతమార్చిన దంపతులు

Allu Arjun: రేవతి మరణానికి అల్లు అర్జునే కారణం.. రాళ్లు రువ్విన జాక్ (video)

King cobra : నన్నే పట్టుకుంటావట్రా..చుక్కలు చూపెట్టిన కోబ్రా. పాము కాటు నుంచి పిల్లి ఎస్కేప్ (వీడియోలు)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)

అల్లు అర్జున్ సినిమాల్లో మాదిరి నిజ జీవితంలో నటిస్తున్నట్లు కనిపిస్తోంది.. చామల

పుష్ప-2: స్మగ్లింగ్‌ను కీర్తిస్తున్న సినిమాకు సబ్సిడీలా.. సీపీఐ నారాయణ

అల్లు అర్జున్ థియేటర్‌ బయట రోడ్‌షోలో పాల్గొన్నాడా లేదా..? వీడియోలున్నాయ్‌గా?

తర్వాతి కథనం
Show comments