Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమాటాలను తింటున్నారా..? అయితే మీ లివర్‌కు మేలే..

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (16:16 IST)
మనం నిత్యం తింటున్న కూరగాయల జాబితాలో టమాట ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్‌లో రేటు ఎంత తక్కువైనా, ఎక్కువైనా వీటి వాడకం అనివార్యమైంది. అయితే వీటి వాడకం వల్ల కూరలు రుచికరంగా మారడమే కాకుండా ఆరోగ్యానికి తగిన మేలు చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


నిత్యం టమాటాలను ఆహారంలో ఎక్కువగా తీసుకున్నట్లయితే, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనాలలో తేలింది. 
 
టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఈ క్రమంలోనే లైకోపీన్ శాతం ఎక్కువగా ఉండే టమాటా పౌడర్‌ను ఎలుకలకు తినిపించి సైంటిస్టులు వాటిపై ప్రయోగం చేసారు. దీని వలన వాటిలో క్యాన్సర్ కణాల వృద్ధి తగ్గిందని, బాక్టీరియా పెరుగుద‌ల న‌శించింద‌ని సైంటిస్టులు గుర్తించారు. 
 
అలాగే ట‌మాటాల‌ను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల వాటిల్లో ఉండే లైకోపీన్ క్యాన్స‌ర్ క‌ణాల పెరుగుద‌ల‌ను అడ్డుకుంటుంద‌ని, లివ‌ర్ క్యాన్స‌ర్ రాకుండా చేస్తుంద‌ని, అలాగే లివ‌ర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగు ప‌రుస్తుంద‌ని సైంటిస్టులు పేర్కొంటున్నారు.

వీటితో పాటుగా గుండె జబ్బులను కూడా రాకుండా చేస్తుందని అంటున్నారు. కాబట్టి టమాటాలను ఆహారంలో ఎక్కువగా ఉపయోగించే వారు పైన పేర్కొన్న ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందినట్లే మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

తర్వాతి కథనం
Show comments