Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? ఐతే ఐస్ ముక్కల్ని?

వేసవిలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? హాయిగా వుందామని చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తున్నారా? అయితే ట్రిప్పుకొచ్చి.. ఆహారంపై దృష్టి పెట్టడం మానేశారంటే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని వ

Webdunia
సోమవారం, 23 ఏప్రియల్ 2018 (13:09 IST)
వేసవిలో పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారా? హాయిగా వుందామని చల్లని ప్రాంతాలను వెతుక్కుంటూ వెళ్తున్నారా? అయితే ట్రిప్పుకొచ్చి.. ఆహారంపై దృష్టి పెట్టడం మానేశారంటే అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆహారంపై పెద్దగా దృష్టి పెట్టరు. ఏదో దొరికిన ఆహారాన్ని తీసుకోవడం.. అలాగే రుచిగా వుండే ఆహార పదార్థాలను లాగించేయడం చేస్తుంటారు. 
 
అంతేగాకుండా.. దారిలో కనిపించే పదార్థాలన్నీ రుచిచేస్తుంటారు. కానీ పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మసాలా లాంటి వేడిచేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. శరీరానికి చలవ చేసే ఆహారాన్నే తీసుకోవాలని.. ముఖ్యంగా వేసవిలో శరీరానికి మేలు చేసే ఆహార పదార్థాల్లే డైట్‌లో చేర్చుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
అలాగే పర్యాటక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎక్కువగా నీరు తాగాలి. నిమ్మరసం బాటిల్ బ్యాగులో పెట్టుకోవాలి. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకుంటూ వుండాలి. చల్లగా ఉంటుందని ఎక్కువగా పానీయాల్లో ఐస్ ముక్కలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని గమనించండి.
 
అలాగే మసాలా దినుసులు, కారపు ఆహార పదార్థాలను పక్కనబెట్టాలి. వీలైనంత వరకు మితమైన కారం, ఉప్పు వుండే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకుంటే వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసిన వారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments