Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింతపండు ఆరోగ్యానికి ఎలా సాయపడుతుందంటే...

Webdunia
మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (21:39 IST)
సాధారణంగా సాంబార్, రసం, పులిహోర.. వంటకం ఏదైనా.. కాస్తంత చింతపండు పులుపు తగాలాల్సిందే. ఎలాంటి వంటకానికైనా.. చింతపండు.. విభిన్నమైన రుచిని అందిస్తుంది. చట్నీలు, కూరలు, రకరకాల వంటకాల్లో చింతపండుని పులుపు, తీపి ఫ్లేవర్ రావడానికి ఉపయోగిస్తారు. చింతపండు రుచికే కాదు ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా మంచి పాత్ర వహిస్తుంది. చింతపండులో గల ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. చింతపండులో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే.. చింతపండు హెల్తీ ఇంగ్రిడియంట్‌గా మారింది. అలాగే చింతపండు వంటకాలను గొంతు నొప్పి, వాపు, సన్ స్ట్రోక్, దగ్గు, జ్వరం నివారించడానికి ఉపయోగిస్తారు.
 
2. చింతపండులో హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల ఫ్యాట్ ఉత్పత్తి తగ్గిస్తుంది. ఇది సిట్రిక్ యాసిడ్ వంటిది. హైడ్రాక్సి సిట్రిక్ యాసిడ్‌ను ఇతర మొక్కల్లో కూడా కనుగొనడం జరిగింది. ఇది శరీరంలో ఎంజైమ్స్‌ను గ్రహిస్తుంది. ఫ్యాట్ చేరకుండా నివారిస్తుంది. దాంతో బరువు తగ్గుతారు.
 
3. చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అలాగే హానికారక ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దీనివల్ల క్యాన్సర్ ముప్పు తగ్గించుకోవచ్చు. అలాగే.. కోలన్ క్యాన్సర్ రిస్క్ తగ్గించే మినరల్స్ ఇందులో ఉంటాయి. అలాగే పొట్టలో, ప్రేగుల్లో చిన్న పుండ్లు ఏర్పడి బాధ కలుగుతుంది. ఇటువంటి పరిస్థితి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
 
4. చింతపండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల.. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ ని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ చేస్తుంది. చింతపండులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఎర్రరక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డిఎల్ ఉత్పత్తిని పెంచుతుంది. అలాగే రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగేందుకు సహాయపడుతుంది. ఫ్యాట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. హై బ్లడ్ ప్రెజర్‌ను తగ్గిస్తుంది.
 
5. చింత పండులో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతుంది. దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది. చింతపండు నీళ్లను టీ రూపంలో తీసుకుంటే జలుబు, దగ్గు తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments