Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవకాడో తిన్నవారికి అవన్నీ...

Advertiesment
అవకాడో తిన్నవారికి అవన్నీ...
, సోమవారం, 18 ఫిబ్రవరి 2019 (18:31 IST)
ప్రకృతి ప్రసాదగించిన పండ్లలో అవకాడో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పండుగా చెప్పవచ్చు. అవకాడోలో పోషకాలు సమృద్ధిగా మరియు ఎ,బి మరియు ఇ వంటి విటమిన్లు అధిక కంటెంట్‌లో ఉన్నాయి. అంతేకాక ఫైబర్స్ మరియు ప్రోటీన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అవెకాడో అనేది కొవ్వు కలిగిన పండ్లలో ఒకటి అని చెప్పవచ్చు. 
 
అంతేకాక అధిక కేలరీలను కూడా కలిగి ఉంటుంది. కానీ కొవ్వు ఆరోగ్యకరమైనది మరియు అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. అవకాడోలో ప్రోటీన్లు, విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉండుటవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
 
1. అవెకాడోలో కేలరీలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉంటుంది. అందువలన బరువు పెరిగే వారి ప్రయోజనం కోసం చాలా మంచి పండుగా పరిగణిస్తారు. ఈ పండులో కొవ్వులు మరియు పిండి పదార్థాల మంచి మూలం ఉంది. 100 గ్రాముల అవెకాడో సుమారు 60-80 కేలరీలను కలిగి ఉంటుంది. అందువల్ల అదనపు బరువును పెంచడానికి ఖచ్చితంగా వారి ఆహార ప్రణాళికలో అవెకాడోను చేర్చాలి.
 
 2. అవెకాడోలో గుండె వ్యాదులను నివారించటంలో సహాయపడే బి6 ఫోలిక్ ఆమ్లం సమృద్దిగా ఉంటాయి. అందువలన అవెకాడో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. అధిక మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉండుటవల్ల గుండె స్ట్రోక్స్ నిరోధించడానికి మంచిదని భావిస్తారు.
 
 3. అవెకాడో పండు నూనె చర్మపు నిర్మాణం మరియు నాణ్యత మెరుగుపర్చడానికి ఉత్తమ నూనెలలో ఒకటిగా ఉంది. పొడి చర్మంపై నూనె మర్దనా కూడా కఠినమైన పాచెస్‌ను మెరుగుపరుస్తుంది. అంతేకాక చర్మం మళ్ళీ అందంగా మరియు ప్రకాశవంతముగా తయారవుతుంది. అందువలన అవెకాడో నూనెను అనేక సౌందర్యసాధనాలలో ఉపయోగిస్తారు.
 
 4. అవెకాడో రక్తంలో చక్కెర స్థాయిలను నిలబెట్టడానికి సహాయపడే మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాల కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఈ కొవ్వులు శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి స్థాయిని నియంత్రిస్తాయి. అందువలన అవెకాడో తక్కువ చక్కెర స్థాయి సమస్యతో బాధపడుతున్న వ్యక్తుల కోసం ఉపయోగకరంగా ఉంటుంది. 
 
5. అవెకాడో పండును ఆర్థరైటిస్ నొప్పి నివారణ కొరకు ఉపయోగిస్తారు. ఇది యాంటీ శోథలక్షణాలను కలిగి ఉంటుంది. అందువల్ల కీళ్లనొప్పి కారణంగా వచ్చే జాయింట్ మంట మరియు నొప్పి కొరకు ఉపయోగకరంగా ఉంటుంది. అవెకాడోలో కొవ్వులు,విటమిన్లు మరియు ఇనుము మరియు పొటాషియం వంటి ఖనిజాలు ఉండుటవల్ల నొప్పి స్వస్థత లక్షణాలు కలిగి ఉంటుంది. అవెకాడో నూనెను మసాజ్ చేయటం ద్వారా దీర్ఘకాలిక నొప్పి సమస్యలను తగ్గించవచ్చు. 
 
6. అవెకాడోలో యాంటి ఏజింగ్ లక్షణాలు ఉండుటవల్ల చర్మం తాజాగా మరియు తక్కువ వయస్సు వారిగా కనపడేలా చేస్తుంది. క్యాన్సర్ నివారించేందుకు మరియు మధుమేహం నియంత్రణకు సహాయపడుతుందని చెబుతుంటారు. గుండె,చర్మం మరియు కండరములకు సంబంధించిన వ్యాధులకు గొప్ప నొప్పి నివారణిగా పరిగణిస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేనెతో నానబెట్టి ఖర్జూరాలు తింటే..?