ఎండు ఖర్జూలు ఆరోగ్యానికి మంచి టానిక్‌లా పనిచేస్తాయి. తరచు వీటిని తీసుకోవడం వలన మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అలాంటి ఈ ఖర్జూరాలను తేనెలో నానబెట్టి తింటే.. ఎంతో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు వైద్యులు. మరి ఆ లాభాలేంటో ఓసారి పరిశీలిద్దాం..
కప్పు ఖర్జూరాలలో స్పూన్ తేనె వేసి కాసేపు అలానే ఉంచాలి. ఆపై మూతపెట్టి వారం రోజుల పాటు అలానే ఉంచాలి. వారం తరువాత రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల చొప్పున ఈ ఖర్జూరాలను తింటుంటుంటే దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఇలా తేనెలో నానబెట్టిన ఖర్జూరాలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకలు విలువలు పుష్కలంగా అందుతాయి.
మలబద్ధకంతో బాధపడేవారు మూడురోజులు ఈ ఖర్జూరాలను తింటే ఫలితం ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు దూరం అవుతాయి. కడుపులో క్రిములు ఉంటే చనిపోతాయి. రక్త సరఫరా మెరుగుపడుతుంది. దాంతో పాటు శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా అందుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది.