Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రి మిగిలిన అన్నం ఉదయం తింటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి...!!

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (10:16 IST)
ఇంట్లో రాత్రి అన్నం మిగిలితే మరుసటి రోజు ఉదయం తినడం చాలామందికి అలవాటు. మీరు కూడా ఇలా చేస్తుంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. లేకపోతే ఈ పాడైన అన్నం మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేస్తుంది.

అటువంటి పరిస్థితిలో మిగిలిపోయిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. మిగిలిన అన్నం తినడం మీ ఆరోగ్యానికి హానికరం అని చాలా పరిశోధనలు వెల్లడించాయి.

నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆధారంగా ఇండిపెండెంట్ ఇచ్చిన నివేదికలో మిగిలిన అన్నంతినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు.

అటువంటి పరిస్థితిలో మీరు మరుసటి రోజు మిగిలిపోయిన అన్నం తినడం మానుకోవాలి. అంతేకాదు ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్ కూడా కావొచ్చు.
 
ఈ నివేదిక ప్రకారం.. బియ్యం ఉడికిన తరువాత గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచినప్పుడు బ్యాక్టీరియాగా మారుతుంది. దీని తరువాత ఈ బ్యాక్టీరియా మీ శరీరంలోకి ప్రవేశించినప్పుడు మీకు ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది.

అందువల్ల అన్నాన్ని గది ఉష్ణోగ్రత వద్ద ఎక్కువసేపు ఉంచకూడదు. అన్నం చాలా సమయం నిల్వ ఉంటే తినకూడదు. సరైన పద్దతి ఏంటంటే మీరు అన్నం వండిన తర్వాత ఒకటి లేదా రెండు గంటలలోపు తినాలి.

ఒకవేళ మీరు అలా చేయకపోతే దానిని ఫ్రిజ్‌లో ఉంచండి. ఫ్రిజ్‌లో ఉంచిన అన్నం కొన్ని గంటల తర్వాత తినవచ్చు. కానీ ఒక రోజు తర్వాత తినకూడదు. అన్నం కొన్ని గంటలు మాత్రమే ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది.

అలాగే అన్నం వేడి చేసిన తర్వాత తినాలనుకుంటే ఒక్కసారి మాత్రమే వేడి చేయండి. మళ్లీ మళ్లీ వేడి చేసిన అన్నం తినకూడదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

తర్వాతి కథనం
Show comments