వేసవిలో తినాల్సిన, తినకూడని పదార్థాలు ఏమిటి?

వేసవి వచ్చేసింది. ఈ వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. అందుచేత నీటిశా

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (16:52 IST)
వేసవి వచ్చేసింది. ఈ వేసవిలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వేటిని తీసుకోకూడదని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వేసవిలో శరీరంలో నీటి శాతాన్ని సక్రమంగా ఉంచుకోవాలి. నీటిని మాత్రమే తాగడంతో శరీరంలోని నీటి శాతాన్ని సరైన స్థాయిలో ఉంచుకోవడం కుదరదు. అందుచేత నీటిశాతం అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం చాలా మంచిది. వేసవిలో సూప్ వెరైటీలు, పండ్ల రసాలు, నీరు, మజ్జిగ పదార్థాలను ఎక్కువగా తీసుకుంటుండాలి. ఇలా తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది.
 
చాలామంది బయట నుంచి ఇంటికి చేరుకున్నాక ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ వాటర్‌ను గటగటా తాగేస్తుంటారు. అలా తాగడం మంచిది కాదు. ఇలా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత ఉన్నట్టుండి పెరిగిపోతుంది. ఆహారం తీసుకునేముందు 10 నిమిషాలకు ముందు రెండు గ్లాసుల నీరు తాగడం మంచిది. కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌ను సేవించడాన్ని తగ్గించాలి. కాకర, వంకాయ వంటివి వేసవిలో తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే వేసవిలో ఇవి అంత త్వరగా జీర్ణంకావు. అలాగే మాంసాహారాన్ని కూడా తగ్గించుకోవడం మంచిది.
 
పుచ్చకాయలో 90 శాతం నీటి శాతం ఉండటంతో శరీరానికి తగిన నీటి శాతాన్ని పుచ్చకాయ అందిస్తుంది. కీరదోస ముక్కల్ని కూడా అధికంగా తీసుకోవచ్చు. వేసవిలో నీటిద్వారా వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి నీటి విషయంలో జాగ్రత్త అవసరం.
 
వేసవికాలంలో ఎక్కువగా పగటి పూట తిరగకుండా ఉండటం మంచిది. ఒకవేళ విధిలేని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే సన్‌స్క్రీన్, టోపి, సన్‌గ్లాసెస్, గొడుగులు వంటివి ఉపయోగించాలి. వేసవికాలంలో తగినంత నిద్రపోవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కనీసం 20 నిమిషాలైనా వ్యాయామం లేదా వాకింగ్ చేయడం ఉత్తమం. తాజా ఆహారాన్నే తీసుకోవాలి. నిల్వ చేసిన ఆరోగ్యాన్ని తీసుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నూలు ప్రమాదానికి నిర్లక్ష్యమే కారమణమా? సీఎం చంద్రబాబు హెచ్చరిక

ట్రావెల్ బస్సు యజమానులపై హత్యా కేసులు పెడతాం : టి మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరిక

ఒకే ఊరు.. ఒకే పాఠశాల .. మూడు వ్యవధి .. ముగ్గురు స్నేహితుల బలవన్మరణం... ఎందుకని?

కోవిడ్-19 mRNA వ్యాక్సిన్‌లు క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడతాయట!

కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం: మృతుల కుటుంబానికి రూ.5లక్షలు ప్రకటించిన తెలంగాణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

Ratika: రతిక ప్రధాన పాత్రలో ఎక్స్ వై డిఫరెంట్ పోస్టర్‌

Spirit : ప్రభాస్.. స్పిరిట్ నుంచి సౌండ్ స్టోరీ ప్రోమో - రవితేజ, త్రివిక్రమ్ వారసులు ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments