సలాడ్స్‌లో వెనిగర్ తప్పకుండా వేసుకోవాలట.. ఎందుకు?(వీడియో)
ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్‌లో రోజూ వారీ డైట్‌లో తీసుకోవడం ఎంతో మంచిది. కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం దూరమవుతుంది. ఒబిసిటీ కనుమరుగవుతుంది. వెబ్ సలాడ్లలో క్యారెట్లు, దోసకాయ, టమోటాలు, ఉల్లిపాయలు, అల్లం తప్పక చే
ఫ్రూట్ సలాడ్, వెజ్ సలాడ్‌లో రోజూ వారీ డైట్‌లో తీసుకోవడం ఎంతో మంచిది. కూరగాయలు, పండ్లను తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. మధుమేహం దూరమవుతుంది. ఒబిసిటీ కనుమరుగవుతుంది. వెబ్ సలాడ్లలో క్యారెట్లు, దోసకాయ, టమోటాలు, ఉల్లిపాయలు, అల్లం తప్పక చేర్చాలి. ఇలా ఆకుకూరలు, కూరగాయలతో తయారైన సలాడ్స్‌ను రోజుకు ఓసారైనా తినాలి.
అది కూడా మధ్యాహ్నం లేదా రాత్రి భోజనానికి ముందు తినడం మంచిది. అయితే ఏ సలాడ్ తీసుకున్నా ఓ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. సలాడ్స్‌లో వెనిగర్‌ను చేర్చుకోవడం ద్వారా రక్తం తక్కువ మోతాదులో చక్కెరని పీల్చుకుంటుంది. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. తద్వారా మధుమేహం, ఒబిసిటీ బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
అలాగే ఫాస్ట్‌ఫుడ్స్‌ని పూర్తిగా పక్కనబెట్టేయడం ద్వారా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. పిజ్జాలు, బర్గర్‌లు, ఫ్రై పదార్ధాలు తీసుకోవడం ద్వారా ఒబిసిటీ తప్పదు. వీటిల్లోని కొవ్వు అజీర్తికి దారితీస్తుంది. గుండె సంబంధిత సమస్యలు అధికం అవుతాయి. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉంటే మధుమేహం బారినపడకుండా తప్పించుకోవచ్చు. వీటికి బదులు ఓట్స్, బార్లీ, గోధుమ, ఎరుపు రంగు బియ్యం వంటివి తీసుకోవడం ద్వారా బరువు తగ్గుతారని, డయాబెటిస్ నుంచి తప్పించుకునే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.