వేసవిలో సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..

Webdunia
బుధవారం, 1 మే 2019 (20:31 IST)
ఆరు పలకల దేహంగా మార్చుకోవాలని నేటి తరం యువత ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం ప్రణాళిక లేని వ్యాయామాలతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎస్.ఆర్.నగర్లో ఏర్పాటు చేసిన ఓ ప్రముఖ జిమ్‌లో పంజాబ్‌కు చెందిన ఆదిత్య వ్యాయామం చేస్తూ ప్రాణాలు వదిలాడు.

గతంలో చింతల్ బస్తీలో ట్రెడ్‌మిల్ చేస్తూ మరొక వ్యక్తి  చనిపోయాడు. ఏడాది క్రితం దిల్‌సుఖ్ నగర్‌లోనూ జిమ్‌లో అధికసేపు చేసిన వ్యాయామం ఓ యువకుడి ప్రాణాల్ని బలిగొంది. సిక్స్ పాక్ కోసం జిమ్‌లో ఆరేడు గంటల గంటలపాటు వ్యాయాయం చేస్తూ ఉంటున్నారు యువకులు. ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు పరీక్షించుకోకపోవడంతో గుండె పల్స్ తెలుసుకోలేక ఎక్కువ సేపు వ్యాయామం చేసి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. 
 
మండు వేసవిలో జిమ్ చేస్తున్న వారు మంచినీరు, గ్లూకోజ్, నిమ్మరసం వంటివి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వేసవిలో శారీరక వ్యాయామం ఎక్కువగా చేయడంతో ఉష్ణోగ్రతల కారణంగా చెమట రూపంలో సోడియం, పొటాషియం బయటకు పోయి ఆ ప్రభావం మూత్రపిండాలపై పడుతుంది. తద్వారా  హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదాలు లేకపోలేదని అంటున్నారు వైద్యులు. 
 
సిక్స్ ప్యాక్ కోసం ఉత్ప్రేరకాలు వాడుతున్నారు కొందరు యువకులు. కొన్ని జిమ్‌లలో విటమిన్ పౌడర్లు, ట్యాబెట్లు ఇస్తున్నారు. జిమ్ చేసి అలసిపోయిన యువత ఆ పౌడర్లు, ట్యాబెట్లతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడటంతో ప్రమాదకరంగా మారుతోంది. వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరని..లేకుంటే ప్రాణాలకు ముప్పే అంటున్నారు నిపుణులు. 
 
అధిక వ్యాయామంతో ఆక్సిజన్ నాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉందని, సూర్యోదయం, సూర్తాస్తమయం వేళే వ్యాయామం చేస్తే మంచిదంటున్నారు వైద్యులు. నాలుగైదు రోజులు జిమ్‌కు వెళ్లలేని  వారు ఒకేసారి అన్ని రోజుల వ్యాయామం చేయాలని ఆతృత చూపిస్తుంటారు. గంటల తరబడి చేసే వ్యాయామం వల్ల శరీరంలోని నీరంతా చెమట రూపంలోకి వెళ్తోంది. అలాంటప్పుడు డీ హైడ్రేషన్ బారినపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు వైద్యులు.
 
ఒకవేళ సిక్స్ పాక్ కోసం ట్రై చేయాలంటే సరైన ఫిట్నెస్ నిపుణల సూచనల మేరకు మాత్రమే చేయాలంటున్నారు. వ్యాయామం చేసే మన శరీరం హాయిగా నవ్వుకోవాలని అంతేగాని అలసిపోకూడదని మరికొందరు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మంచిర్యాలలో పులి సంచారం.. బిక్కు బిక్కుమంటూ గడుపుతున్న గ్రామస్థులు

ఏపీలో రోడ్ల మరమ్మతుల కోసం రూ. 1,000 కోట్లు మంజూరు

గుంటూరులో ఘాతుకం: చెల్లెలు కంటే పొట్టిగా వున్నాడని బావను చంపిన బావమరిది

డోనాల్డ్ ట్రంప్‌కు మొండిచేయి ... మరియా కొరీనాకు నోబెల్ శాంతి బహుమతి

Chandra Babu: 15 సంవత్సరాలు సీఎం పదవిని చేపట్టిన వ్యక్తిగా చంద్రబాబు రికార్డ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

ఓటీటీలోకి వచ్చిన మారుతి టీం ప్రొడక్ట్ త్రిబాణధారి బార్బరిక్

తర్వాతి కథనం
Show comments