Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఫ్యాట్ ఫుడ్స్, స్నాక్స్ వద్దే వద్దు.. 20 నిమిషాలకోసారి నీళ్లు తాగండి..

భోజనానికి ముందు ఆయిల్ ఐటమ్స్ తీసుకుంటున్నారా? బిస్కెట్లు లాగిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. భోజనానికి రెండు గంటల ముందు ఎలాంటి స్నాక్స్ తీసుకోకూడదు. భోజనంలో తప్పనిసరిగా పాలు..కూరగాయలు..పండ్లు ఉండేలా జా

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (13:20 IST)
భోజనానికి ముందు ఆయిల్ ఐటమ్స్ తీసుకుంటున్నారా? బిస్కెట్లు లాగిస్తున్నారా? అయితే కాస్త ఆగండి. భోజనానికి రెండు గంటల ముందు ఎలాంటి స్నాక్స్ తీసుకోకూడదు. భోజనంలో తప్పనిసరిగా పాలు..కూరగాయలు..పండ్లు ఉండేలా జాగ్రత్త పడాలి. ఉదయం టిఫిన్ తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. తీసుకోకపోవడం వల్ల శరీర భాగాలకు సరిపడా శక్తి అందక ఎనీమియాకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
నిద్రలేవగానే మూడు గ్లాసుల నీరు సేవించాలి. ఆ నీరు శరీరంలోని పేరుకపోయిన వ్యర్థానంతా వెలివేస్తుంది. అలాగే బరువును అదుపులో ఉంచుకోవాలి. దీని కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రోజువారీ ఆహారంలో కాయగూరలూ, పండ్లూ ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి.
 
రక్త హీనత రాకుండా ఉండేందుకు ఆహారంలో తప్పకుండా ఐరన్ ఉండే విధంగా చూసుకోవాలి. వేసవిలో చేపలు, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు ఆహారంలో ఉండే విధంగా చూసుకోవాలి. ప్రతి 20 నుండి 30 నిమిషాలకొకసారి నీళ్లు తాగుతుండడం చేయాలి. పాలు, కోడిగుడ్లు తీసుకోవాలి. వీలైనంత వరకు వేసవిలో కొవ్వు పదార్థాలను తీసుకోకపోవడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments