పాదాలకు పెడిక్యూర్ ఇలా చేసుకోండి... ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో?

పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను శుభ్రంగా వాష్ చేసుకోండి. కాలి గోళ్లను కత్తిరించుకోవాలి. వారానికోసారి పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (13:08 IST)
పాదాలు అందంగా ఆకర్షణీయంగా మారాలంటే.. ఈ టిప్స్ పాటించండి. స్నానం చేస్తున్నప్పుడు పాదాలను శుభ్రంగా వాష్ చేసుకోండి. కాలి గోళ్లను కత్తిరించుకోవాలి. వారానికోసారి పాదాలను సబ్బుతో కడగాలి. ఒక చెంచా క్యుటికల్‌ క్రిము లేదా రెండు చెంచా ఆలివ్‌ ఆయిల్‌, రెండు చెంచాల నిమ్మరసం లేదా ఐదు చుక్కల గ్లిజరిన్‌ బాగా కలిపి చేతులకు, పాదాలకు రాసుకోవాలి. 
 
15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటిలో షాంపు వేసి 15 నిమిషాల పాటు నాన బెట్టాలి. ఇలా చేయడం ద్వారా పాదాలమీద వున్న మురికి అంతా మెత్తబడి తొలగిపోతుంది. ఈ నీళ్లలోనే పాదాలను ఉంచి.. ప్యూమిక్‌స్టోన్‌తో మడమల మీద ఏర్పడిన పగుళ్ళపై మూడు-నాలుగు నిమిషాల పాటు రుద్దండి. దీనివలన పాదాలపై పేరుకున్న మురికి వచ్చేస్తుంది. మంచినీళ్ళతో పాదాలను సబ్బుతో కడిగిన తర్వాత మరోసారి బాగా రుద్దుతూ కడగాలి. 
 
రోజూ రాత్రి పూట హ్యాండ్‌క్రీమ్‌ కొద్దిగా నిమ్మరసంతో కలిపి పాదాలకు రాసుకుంటే మృదువుగా తయారవుతాయి. కాలి మడమలో తీవ్రమైన పగుళ్ళు ఉంటే రాత్రి పూట పెట్రోలియం జెల్లీ రాసుకుని పాదాలకు సాక్సు ధరించి నిద్రించడం మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

SIRలో పేరు తొలగిస్తారనే భయంతో 51ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య

వెనెజులాలో భారీ భూకంపం.. 1,450కి పెరిగిన మృతుల సంఖ్య

పైలట్‌కు అంతరాయం కలిగించిన లేజర్ కాంతి .. విమానం ల్యాండ్ అవుతుండగా..? (video)

విందులో మాంసం వడ్డించలేదని కేటరింగ్ సిబ్బందిపై మైనర్ల దాడి

వైకాపా నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషనులో అట్రాసిటీ కేసులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కావ్యా మారన్‌ను అనిరుధ్ పెళ్లాడనున్నారా?

శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో 'ఈఠ' టైటిల్ వివాదం ఏంటి?

నా భర్త గోవిందాకు అనేక మంది మహిళలతో సంబంధం ఉంది : భార్య సునీత అహుజా

నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బాహుబలి ది టార్చ్ బేరర్

వెంకటేష్-త్రివిక్రమ్ కాంబోలో ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47 విడుదల తేదీ ఖరారు

తర్వాతి కథనం
Show comments