కోపం వస్తే.. కాస్త ఎందుకో ఆలోచించండి..

Webdunia
బుధవారం, 22 మే 2019 (17:34 IST)
ప్రతి చిన్న విషయానికి మీకు కొపం వస్తుంటే దానికి కారణం ఏమిటని మీరు ఆలోచించారా? చాలా మంది చేసే పనిపై శ్రద్ధ పెట్టలేకపోవడం, చిరాకు పడటం, విసుగు చెందడం జరుగుతుంటుంది. నిద్రలేమితో బాధపడే వారిలో ఈ లక్షణాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. రాత్రి పూట సరిగ్గా నిద్రపోకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యంపై బాగా పడుతుంది. 
 
నిద్రలేమితో బాధపడేవారు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం తదితర కారాణాల వల్ల చాలా మందికి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అయితే ఈ సమస్య కారణంగా మరో పెద్ద సమస్య వెంటాడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

రాత్రి పూట తక్కువ సమయం నిద్రపోయేవారు ఎక్కువ కోపం ప్రదర్శిస్తారని ఇటీవల ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాకుండా ఒక నిరాశపూరిత వాతావరణంలో వారు ఉంటారట. సాధారణంగా అలసిపోయిన వారిలో చికాకు కనిపిస్తుంది. 
 
అదే పరిస్థితి తక్కువ నిద్రపోయే వారిలోనూ ఉంటుందని, అకారణంగా ఎదుట వారిపై విరుచుకుపడతారని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మేరకు కొందరిని ఎంపిక చేసి రెండ్రోజులపాటు వారు ఎంతసేపు నిద్రపోవాలో చెప్పి చూశారు.

కనీసం ఏడు గంటలకు పైగా నిద్రపోయిన వారు సాధారణంగా ఉంటే, నాలుగు గంటల కంటే తక్కువ నిద్రపోయిన వారిలో చికాకు, కోపం కనిపించాయని తెలిపారు. అందుకే కంటినిండా నిద్రపోవాలి. దానితోపాటు పౌష్టికాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మంత్రిగా చేయలేని పనిని ఓ అమ్మాయి సాధించింది: రఘువీరా రెడ్డి ప్రశంస (video)

వివాహేతర సంబంధం: వివాహిత కోసం పాత ప్రియుడిని చంపేసిన కొత్త ప్రియుడు

బంగ్లాదేశ్‌లో హిందువులను చంపేస్తున్నారు... మరొకరిని కొట్టి నిప్పంటించారు...

భర్త వియోగం తట్టుకోలేక... ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా..

నూతన సంవత్సర వేడుకల్లో పూటుగా తాగి పడిపోయిన బెంగళూరు యువతులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతడు ఓ దుర్మార్గుడు - మహిళలను మానసిక క్షోభకు గురిచేస్తారు : పూనమ్ కౌర్

కింగ్డమ్ ఫస్ట్ పార్ట్ దెబ్బేసింది, ఇంక రెండో పార్ట్ ఎందుకు? ఆగిపోయినట్లేనా?

'రాజాసాబ్' విజయం సాధించకూడదని కొందరు కోరుకుంటున్నారు : మారుతి

మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని : హీరో నవీన్ పోలిశెట్టి

శివాజీ గారు అలా మాట్లాడితే విజిల్స్, చప్పట్లు కొట్టారు, వాళ్లనేం చేయాలి?: నవదీప్ ప్రశ్న

తర్వాతి కథనం
Show comments