ముల్లంగిని ఆహారంలో చేర్చుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయట..

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:25 IST)
మనం నిత్యం అనేక రకాలైన కూరగాయలను వాడుతుంటాము. మన ఆరోగ్యానికి శ్రేయస్సును చేకూర్చే పోషకాలు ఒక్కో కూరగాయలో వేరువేరుగా ఉంటుంది. మనం ఆహారంగా తీసుకునే దుంపకూరల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీర పోషణకే గాక ఆరోగ్యరక్షణలో కూడా ఉపయోగపడే దుంపకూరల్లో ముల్లంగికి ప్రత్యేక స్థానం. 
 
అంతేకాకుండా ముల్లంగిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శృంగార పరమైన సమస్యలు తగ్గుతాయి. దీనిని సాంబారులో విరివిగా వాడతారు. పచ్చడి చేసుకుంటారు. ముల్లంగిలోని ఔషద గుణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి. 
 
చెవిపోటు ఉన్నవాళ్లు నువ్వుల నూనెలో మూడు పాళ్ల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే తగ్గుతుంది. నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని చూర్ణంలా చేసుకుని రోజూ రెండుసార్లు తీసుకోవడం వల్ల మూత్రపిండం, మూత్రాశయాలలో రాళ్ళు కరిగిపోతాయి.
 
ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ఉంచితే మంట, నొప్పి, పోటు త్వరగా తగ్గుతాయి. ఇటీవల కాలంలో మగవారిలో శృంగార సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. అలాంటివారు ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవుపాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే సమస్య తగ్గుతుంది. 
 
ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా ప్రాంతాలకు పట్టిస్తుంటే చర్మవ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. కామెర్ల వ్యాధితో బాధపడేవారు 10 నుండి 20 మిలీ ముల్లంగి ఆకుల రసంలో కొద్దిగా పంచదార వేసి నిత్యం సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

పదేపదే వేడినీళ్లు అడుగుతున్నాడు.. అతనో పిచ్చోడు.. వరుడిపై వధువు మండిపాటు

ChatGPT: 16 ఏళ్ల బాలుడి ఆత్మహత్యకు బాధ్యత వహించని ఓపెన్ఏఐ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిల్ రావిపూడి ఆవిష్కరించనున్న అన్నగారు వస్తారు టీజర్

మరువ తరమా సినిమా పెద్ద విజయం సాధించాలి : రఘు రామ కృష్ణరాజు

Andhra King Taluka Review: అభిమానులకు స్పూర్తినిచ్చేలా ఆంధ్ర కింగ్ తాలూకా.. మూవీ రివ్యూ

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

తర్వాతి కథనం
Show comments