Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రై ఫ్రూట్స్... వాల్ నట్స్ గురించి ఈ 5 విషయాలు తెలిస్తే...

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (18:10 IST)
మనం డ్రైప్రూట్‌గా పిలువబడే వాల్‌నట్ ఆరోగ్య పరంగా చాలా గొప్పగా సహాయపడుతుంది. ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 
అంతేకాదు ఆరోగ్య నిపుణుల ప్రకారం వాల్‌నట్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరంలో మెటబాలిక్ రేటును క్రమంగా పెంచుతుంది. ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. వాల్‌నట్స్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. ప్రతి రోజూ వాల్‌నట్ తింటే ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. వాల్ నట్స్‌లో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి అన్ని రకాల హార్ట్ డిసీజసెస్‌ను ఎదుర్కోవడానికి సహాయపడుతాయి.
 
2. వాల్ నట్స్‌ను మన రోజూవారీ ఆహారంలో తప్పనిసరిగా తీసుకొనే ఆహారంగా గుర్తించాలి. ముఖ్యంగా మహిళల రెగ్యులర్ డైట్లో ఇది తప్పనిసరి. మహిళల్లో టైప్ 3 డయాబెటిస్‌ను నివారించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
 
3. మగవారిలో వీర్యకణాల సమస్యతో బాధపడుతున్నవారు రోజూవారీ ఆహారంలో వాల్ నట్స్‌ను  చేర్చుకోవడం ద్వారా సమస్యను అధిగమించడంతో పాటు, వాటి కదిలిక సామర్థ్యం, చురుకుగా ఉండేందుకు సహాయపడుతాయి.
 
4. వాల్ నట్ తినడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా మెదడు మీద ఎక్కువగా ప్రతిస్పందిస్తుంది. వాల్ నట్‌లో విటమిన్ ఇ మరియు ఫ్లెవనాయిడ్స్ కలిగి ఉండి, జ్ఞాపకశక్తి లోపానికి గురిచేసే, హానికరమైన ఫ్రీరాడికల్స్ మరియు కెమికల్స్‌ను నాశనం చేస్తుంది.
 
5. గర్భిణీ స్త్రీలు వాల్ నట్స్‌ను ప్రతి రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో ఉండే కాంపౌండ్స్ వల్ల పొట్టలో పెరిగే పిండంకు ఎలాంటి అలర్జీలు కలగకుండా తగిన వ్యాధినిరోధకతను పెంచుతాయి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments