Webdunia - Bharat's app for daily news and videos

Install App

విపరీతమైన లైంగిక క్రియలో పాల్గొంటే కాలేయం పాడవుతుందా...?

దేనికైనా ఓ లిమిట్ అంటూ ఉంటుంది. రుచికరంగా ఉంది కదా అని అధిక మోతాదులో ఆహారం తీసుకుంటే ఏమవుతుంది...? జీర్ణక్రియకు సమస్య వస్తుంది. అలాగే ప్రతి ఒక్క అవయవానికి మించిన పనిని కలిగిస్తే అది సమస్యకు మూలమవుతుంది. చాలామంది కాలేయం చెడిపోవడానికి రతి క్రియకు సంబంధ

Webdunia
గురువారం, 28 జులై 2016 (15:50 IST)
దేనికైనా ఓ లిమిట్ అంటూ ఉంటుంది. రుచికరంగా ఉంది కదా అని అధిక మోతాదులో ఆహారం తీసుకుంటే ఏమవుతుంది...? జీర్ణక్రియకు సమస్య వస్తుంది. అలాగే ప్రతి ఒక్క అవయవానికి మించిన పనిని కలిగిస్తే అది సమస్యకు మూలమవుతుంది. చాలామంది కాలేయం చెడిపోవడానికి రతి క్రియకు సంబంధం ఉందని చెప్పుకుంటూ ఉంటారు. ఐతే కాలేయం చెడిపోవడానికి ఇతర కారణాలతో పాటు రతి క్రియ కూడా ఓ కారణమే అని వైద్యులు చెపుతుంటారు. 
 
ముఖ్యంగా హెపటైటిస్ బి అనే వైరస్ లైంగిక క్రియ ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఐతే కాలేయాన్ని బాగా దెబ్బతీసే హెపటైటిస్ సి వైరస్ వ్యాప్తి చాలా అరుదుగా ఉంటుంది. ఈ వైరస్ ఎవరైనా పరిచయం లేని వ్యక్తులతో సంభోగించినపుడు సంక్రమిస్తుందని వైద్యులు చెపుతారు. ఇంకా కొందరిలో వైరల్ హెపటైటిస్ సమస్య ఉంటుంది. అలాంటివారు కూడా సంభోగంలో పాల్గొన్నప్పుడు సమస్య తలెత్తవచ్చు. అందువల్ల కాలేయ సమస్య రాకుండా ఉండాలంటే హెపటైటిస్ వ్యాక్సిన్ వేయించుకోవడం మంచిది.
 
మరికొందరు అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు ఉంటాయి. ఇలాంటి వారు లైంగిక క్రియలో పాల్గొన్నప్పుడు రక్తపోటు తారాస్థాయికి చేరుతుంది. ఐతే ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కానీ అప్పటికే శరీరంలో ఏదైనా వ్యాధి పొంచి ఉంటే మాత్రం అది క్రమంగా కాలేయ సమస్యకు దారితీస్తుంది. ఎందుకంటే సెక్స్ క్రియలో రక్తసరఫరా అధికస్థాయిల్లో ఉంటుంది కాబట్టి అది కాలేయంపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా కాలేయ వ్యాధికి రతి క్రియ కూడా కారణమవుతుంది. ఐతే కేవలం రతిక్రియ కారణంగా కాలేయం చెడిపోతుందనేది మాత్రం అవాస్తవం. కాలేయంలో సమస్య తలెత్తడానికి ఎన్నో కారణాలున్నాయి.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

తర్వాతి కథనం