Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2022 (16:52 IST)
పైనాపిల్‌లో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. పైనాపిల్ 10 ప్రయోజనాలను తెలుసుకుందాము. ఇందులో ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం ఉంటాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ అంశాలన్నీ అవసరం. పైనాపిల్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతూ కణాల క్షీణతను నివారిస్తాయి.
 
ఈ యాంటీఆక్సిడెంట్లు ఆర్థరైటిస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, అనేక రకాల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల నుండి రక్షిస్తాయి. ఒక కప్పు పైనాపిల్ రసం మీకు 73% మెగ్నీషియం ఇస్తుంది, ఇది ఎముకలు, కణజాలాలను బలపరుస్తుంది. చిగుళ్ళు, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో పైనాపిల్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
 
పైనాపిల్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. కంటి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇందులో పొటాషియం ఎక్కువగానూ, సోడియం తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణ వేగాన్ని నియంత్రిస్తుంది. దీన్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల కడుపులోని నులిపురుగులను దూరం చేస్తుంది.
 
పైనాపిల్ గోళ్లను ఆరోగ్యంగా, అందంగా చేస్తుంది. దీంతో చర్మం ముడతలు లేకుండా, అందంగా తయారవుతుంది. ఒక కప్పు పైనాపిల్‌లో 82 కేలరీలు, 0 గ్రాముల కొవ్వు, 0 గ్రాముల కొలెస్ట్రాల్, 2 మిల్లీగ్రాముల సోడియం, 22 గ్రాముల కార్బోహైడ్రేట్లు మరియు 1 గ్రాము ప్రొటీన్లు ఉంటాయి. ఇది విటమిన్ల సరైన కలయిక.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments