Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధిక రక్తపోటు వున్నవారు ఈ పదార్థాలకు దూరంగా వుండాలి

సిహెచ్
బుధవారం, 28 ఆగస్టు 2024 (21:34 IST)
అధిక రక్తపోటు అనేది ఇదివరకు వయసు పైబడినవారిలో కనబడేది. కానీ ఇప్పుడు అది యువతలోనూ కనబడుతోంది. అధిక బిపి సమస్యకు కారణం క్రమబద్ధమైన ఆహారం తీసుకోకపోవడంతో పాటు జీవనశైలిలో తేడాలు. అయితే, చాలా మంది ఈ సమస్యను తీవ్రంగా పరిగణించరు. అయితే అధిక రక్తపోటును అశ్రద్ధ చేస్తే ప్రాణాలకే ముప్పు తెస్తుంది. అధిక బీపీ ఉన్నవారు క్రింద తెలియజేయబోయే పదార్థాలను దూరంగా పెట్టేయాలి.
 
ఉప్పులో సోడియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉప్పును హైబీపీ రోగులకు శత్రువు అంటారు. హైబీపీ ఉన్న రోగులైతే ఉప్పు తీసుకోవడం తగ్గించేయాలి. ఆహార పదార్థాల పైన కొందరికి ఉప్పు చల్లుకుని తినే అలవాటు వుంటుంది. అలాంటి పదార్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు. ఆహారంలో సముద్రపు ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును ఉపయోగించడం మంచిది.
 
ప్రాసెస్ చేసిన మాంసం జోలికి వెళ్లకూడదు. ఎందుకంటే అందులో సోడియం పరిమాణం కూడా చాలా ఎక్కువ. దానిని కాపాడేందుకు ఉప్పు కలుపుతారు. కాబట్టి, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినకూడదు. ఇది కాకుండా, సాస్, ఊరగాయ, చీజ్ లేదా బ్రెడ్‌తో మాంసం తినడం వల్ల సమస్య వేగంగా పెరుగుతుంది. కాబట్టి, హై బీపీ ఉన్నవారు ప్రాసెస్ చేసిన మాంసానికి దూరంగా ఉండాలి.
 
కాఫీలో వుండే కెఫీన్ రక్తపోటును పెంచడానికి పని చేస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు వున్న రోగులకు కాఫీ తీసుకోమని నిపుణులు ఎప్పుడూ సలహా ఇవ్వరు. హైబీపీతో ఇబ్బంది పడుతుంటే కాఫీని మానేయడం మంచిది. అలాగే ప్యాక్ చేసిన ఆహారాలలో సాధారణంగా అధిక మొత్తంలో సోడియం ఉంటుంది. సోడియం ఉన్న ఏదైనా బిపిని పెంచడానికి పని చేస్తుంది. అందుకే మార్కెట్‌లో ఉండే ప్యాక్‌డ్ ఫుడ్స్‌కు బదులుగా ఇంట్లోనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేసుకుని తినడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments