వేడివేడి బజ్జీలొద్దు.. వేడివేడి సూప్‌లు ట్రై చేయండి..

వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. అల్లం, పసుపును వంటల్లో అధికంగా వాడాలి. అల్లంతో చేసిన టీ తాగడం లేదంటే పసుపు కలిపిన పాలు రోజూ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు దూరం అవుతాయి. అలాగే మొలకలూ, మొక్

Webdunia
సోమవారం, 16 జులై 2018 (11:44 IST)
వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. అల్లం, పసుపును వంటల్లో అధికంగా వాడాలి. అల్లంతో చేసిన టీ తాగడం లేదంటే పసుపు కలిపిన పాలు రోజూ తీసుకోవడం ద్వారా దగ్గు, జలుబు దూరం అవుతాయి. అలాగే మొలకలూ, మొక్క జొన్న గింజలు కూడా ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పీచు పుష్కలంగా ఉంటుంది. చాట్‌లాగా లేదంటే సలాడ్‌లాగా చేసుకుని తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
అలాగే వేడివేడి బజ్జీలు, పకోడీల కంటే వేడివేడి సూపులను తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేకూరుతుంది. వాటిలో ఎక్కువగా అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండేలా చూసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. 
 
ఇంకా టొమాటో, క్యారెట్‌, పుట్టగొడుగుల్లాంటివి కేవలం కూరల్లో చేర్చుకోవడమే కాకుండా ఆవిరి మీద ఉడికించి తినాలి. అప్పుడే వాటిలోని పోషకాలు శరీరానికి అందుతాయి. వాటిని నేరుగా తినలేకపోతే ముక్కలుగా చేసి సలాడ్‌లాగా చేసుకుని తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని అనారోగ్య సమస్యలు ఏమాత్రం అంటవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

బిడ్డల కళ్లెందుటే కన్నతల్లి మృతి.. ఎలా? ఎక్కడ? (వీడియో)

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

తర్వాతి కథనం
Show comments