Webdunia - Bharat's app for daily news and videos

Install App

మానసిక బలాన్నిచ్చే.. మామిడి రసం

వేసవిలో విరివిగా లభించే మామిడి పండ్లలో పోషకాలెన్నో వున్నాయి. వేసవి సీజన్‌లో వచ్చే ఈ మామిడి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

Webdunia
ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (14:15 IST)
వేసవిలో విరివిగా లభించే మామిడి పండ్లలో పోషకాలెన్నో వున్నాయి. వేసవి సీజన్‌లో వచ్చే ఈ మామిడి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ-యాక్సిడెంట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. మామిడి కాయలు, పండ్లలోని పాలిఫినాల్స్ లక్షణాలు క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. 
 
మామిడిలో ఐరన్‌ పుష్కలంగా దొరుకుతుంది. మామిడి రక్తహీనతను నివారించేందుకు తోడ్పడుతుంది. ఎసిడిటీ, అజీర్తిలతో బాధపడేవారికి మామిడి దివ్యౌషధంగా పనిచేస్తుంది. డయేరియా, ఎండదెబ్బ, కాలేయవ్యాధులు, ఆస్తమా, నెలసరి సమస్యలకు మామిడి మంచి టానిక్‌గా ఉపకరిస్తుంది. మానసిక ఆందోళనలను కూడా ఇది దూరం చేస్తుంది. 
 
మామిడి రసంతో మానసిక ఆహ్లాదం చేకూరుతుందని.. మానసిక బలహీనులకు మామిడి రసం ఉత్తేజాన్నిస్తుంది. మామిడిలోని ట్రిప్టోఫాన్‌ ఏకాగ్రతను, జ్ఞాపకశక్తిని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. అయితే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. లెక్కకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మామిడి పండ్లలో క్యాలరీలు అధికంగా ఉంటాయి. మామిడి పండ్లు ఎక్కువగా తింటే..  రోజూ ఓ అరగంట వ్యాయామం చేస్తే బరువు పెరిగే అవకాశం ఉండదు.
 
మామిడి పండ్లలో అధిక క్యాలరీలు వుండటంతో అధికంగా వీటిని తీసుకుంటే బరువు పెరిగే అవకాశం వుంది. రోజూ వ్యాయామం చేసేవారు మామిడిని రెండు మూడు తీసుకోవచ్చు. వ్యాయామానికి దూరంగా వుండే వారు మాత్రం రోజుకు ఒక పండుకు మించకుండా తీసుకోవాల్సి వుంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

David Warner: రాబిన్‌హుడ్‌ కోసం హైదరాబాదులో డేవిడ్ వార్నర్- హగ్ ఇవ్వని కేతిక (video)

సూశాంత్ ఆత్మహత్య కేసు : ప్రియురాలు రియా చక్రవర్తికి భారీ ఊరట

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో లైంగిక వేధింపులకు గురయ్యా : వరలక్ష్మి శరత్ కుమార్

బాలీవుడ్ చెక్కేశాక గ్లామర్ డోర్స్ తెరిచిన 'మహానటి'

బాయ్‌ఫ్రెండ్‌తో కటీఫ్.. సినిమా కెరీర్‌పై దృష్టిసారించిన మిల్కీబ్యూటీ!!

తర్వాతి కథనం
Show comments