Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారో గమనించారా?

Webdunia
శుక్రవారం, 20 డిశెంబరు 2019 (16:12 IST)
వారానికి ఎన్ని గంటలు పనిచేస్తున్నారో గమనించారా? పట్టించుకోకుండా గంటలు గంటలు కూర్చుని ఉద్యోగం చేస్తున్నారా? అయితే అనారోగ్యాలు తప్పవు అంటున్నారు... పరిశోధకులు. ఎందుకంటే.. కెనడాలోని లవాల్ వర్శిటీ నిర్వహించిన పరిశోధనలో వారంలో మీరు యాభై గంటలకు మించి పనిచేస్తే అనారోగ్యాలు తప్పవని తేలింది. వారానికి 50 గంటలకు మించి పనిచేస్తున్న వారు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. 
 
ఎందుకంటే ఒత్తిడి కారణంగా రక్తపోటు ఆవహిస్తుందని, అధిక రక్తపోటు కారణంగా ప్రాణాలకే చిక్కు రావచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. మాస్క్ డ్ రక్తపోటు అనేది 50 గంటలకు మించి పనిచేస్తున్న వారిలో అధికంగా కనిపిస్తోందని పరిశోధకులు తేల్చారు. 
 
49 గంటలకు మించి పనిచేసే వారిలో మాస్క్ డ్ రక్తపోటు ఎక్కువగా ఉందని వీరు గుర్తించారు. 41 నుంచి 48 గంటల మధ్య పనిచేసే వారిలో ముప్పు 54 శాతం వరకు ఉందని గుర్తించారు. వారానికి 35 గంటలు పనిచేసే వారి కంటే 50 గంటల కంటే అధిక సమయం పనిచేసే వారిలో 66 శాతం రక్తపోటు ముప్పు అధికంగా ఉన్నట్లు తేల్చారు. 
 
అధిక రక్తపోటు బాధితులు హృదయ, రక్తనాళాల సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తేల్చారు. ఈ మాస్క్ డ్ రక్తపోటు సాధారణ పరీక్షల్లో కనిపించదు. కొన్ని ప్రత్యేక పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించగలరు. పనిభారం ఎక్కువయ్యేకొద్దీ రక్తపోటు ముప్పు మరింత పెరుగుతుంది. కెనడాలో 3500 మంది ఉద్యోగులపై కెనడా విశ్వవిద్యాలయం పరిశోధకులు అధ్యయనం చేశారు.

సంబంధిత వార్తలు

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments