Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో వున్నారా? ఉసిరికాయ జ్యూస్ తప్పక తాగాలట..

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (13:29 IST)
లాక్ డౌన్‌లో వున్నారా? ఉసిరికాయ జ్యూస్ తప్పకుండా తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఉసిరి శరీర రోగ నిరోధక వ్యవస్థను పెంచి జలుబు, దగ్గును దూరం చేస్తుంది. ఉసిరిలోని విటమిన్ సి గుండె సంబంధిత రోగాలను దూరం చేస్తుంది. క్యాన్సర్‌కు చెక్ పెడుతుంది. ఉసిరి, కొవ్వు పదార్థాలను తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. ఉసిరిని తినటం వలన రక్తనాళాలలో ఉండే కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. ఉసిరిలో అధిక మొత్తం ఫైబర్ వుండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది.
 
ఉసిరికాయను తరచూ ఆహారంలో తీసుకుంటే తల వెట్రుకలు త్వరగా తెల్లబడవు, చర్మం మృదువుగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, దంత సంబంధమైన సమస్యలు ధరి చేరవు. ఈ పండ్లు తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే ఆకలి కూడా త్వరగా వేస్తుంది.
 
ఇసినోఫీలియా, అలర్జీతో తరచూ బాధపడే వారు ఒక చెంచా ఉసిరిరసంలో కొద్దిగా తేనె కలుపుకొని తాగితే ఉపశమనం పొందుతారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో ఉసిరి బాగా పని చేస్తుంది. 
 
జ్ఞాపక శక్తి తక్కువగా ఉండే పిల్లలకు ఈ పండ్లు తినిపిస్తే సరిపోతుంది. ఉసిరికాయ గుండె సంబంధిత వ్యాధులను, ఆందోళనలను, అధిక రక్తపోటును తగ్గిస్తుంది. చర్మ సమస్యలు ఉన్న వారు ఉసిరి రసాన్ని చర్మంపై రాసుకుంటే చర్మ సమస్యలు దూరం అవుతాయి. అంతే కాదు ఉసిరికాయ పొడిని, శనగ పిండిలో కలుపుకొని స్నానం చేస్తే చర్మం మృదువుగా, తాజాగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వస్థత - ఆస్పత్రికి తరలింపు (Video)

కొత్త పార్టీ కథ లేదు.. బీఆర్ఎస్‌ను బీజేపీకి అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయ్: కవిత

షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

వల్లభనేని వంశీకి మళ్లీ రిమాండ్ పొడగింపు - కస్టడీ పిటిషన్ కొట్టివేత

గూఢచర్యానికి పాల్పడిన రాజస్థాన్ మాజీ మంత్రి పీఏ - అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

Yash: యాష్ vs రణబీర్: రామాయణంలో భారీ యాక్షన్ మొదలైంది

తర్వాతి కథనం
Show comments