Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాము నుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుందట.. ఆల్కహాల్‌పై కోరికను తగ్గిస్తుందట

వాము నుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఒకటి రెండు చుక్కల నూనె చెవినొప్పినీ ఇన్ఫెక్షన్లనీ కూడా తగ్గిస్తుంది. వాము తినడం వల్ల ఆల్కహాల్ తాగాలనే కోరిక కూడా తగ్గు

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (18:50 IST)
వాము నుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఒకటి రెండు చుక్కల నూనె చెవినొప్పినీ ఇన్ఫెక్షన్లనీ కూడా తగ్గిస్తుంది. వాము తినడం వల్ల ఆల్కహాల్ తాగాలనే కోరిక కూడా తగ్గుతుందట. జలుబుతో ముక్కు బాగా బిగిసిపోయి వుంటే వామును నూరి పలుచని బట్టలో కట్టి వాసన చూపిస్తే అది తగ్గుతుందట.
 
గోరువెచ్చని నీళ్లతో కలిపి తింటే దగ్గుకీ ఉపశమనంగా ఉంటుంది. ఆస్తమాకీ వాము మంచి మందే. వామునీళ్లని పుక్కిలిపట్టడంవల్ల పంటినొప్పీ తగ్గుతుంది. వాముని తేనెతో కలిపి వరసగా పదిరోజులపాటు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగే అవకాశం ఉందట.
 
వాము కడుపునొప్పికి తక్షణ మందులా పనిచేస్తుంది. గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగినా ఓ టీస్పూను వేడి అన్నంలో కలిపి తిన్నా అజీర్తి తగ్గి ఆకలి పెరుగుతుంది. గ్యాస్‌ సంబంధిత సమస్యలూ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
వాంతులు: వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
జ్వరం: వాము, ధనియాలు, జీలకర్ర - ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.
అజీర్ణం: వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని, చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి.
 
దంత వ్యాధులు: వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి.
వాత వ్యాధులు: వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments