Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను తీసుకోవాలంటే?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను తీసుకోవాలంటే..? కాస్త కార్బొహైడ్రేడ్లతో కూడిన ఆహారాన్ని పక్కనబెట్టాలి. ఒక కప్పు వాటర్ మెలోన్‌లో దాదాపు 12 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అలాంటి పుచ్చకాయను తీసుకోవాలను

Webdunia
శనివారం, 15 ఏప్రియల్ 2017 (16:20 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయను తీసుకోవాలంటే..? కాస్త కార్బొహైడ్రేడ్లతో కూడిన ఆహారాన్ని పక్కనబెట్టాలి. ఒక కప్పు వాటర్ మెలోన్‌లో దాదాపు 12 గ్రాముల షుగర్ కంటెంట్ ఉంటుంది. అలాంటి పుచ్చకాయను తీసుకోవాలనుకుంటే.. ఓట్ మీల్‌ ఒక కప్పు జతచేసి తీసుకోవడం మంచిది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. పుచ్చకాయ తీసుకోవాలనుకునే డయాబెటిస్ పేషెంట్లు భోజనం తీసుకోవడం కాస్త ఆలస్యంగా తీసుకోవచ్చు. అలా తీసుకోవాలంటే.. క్యాలరీలను, ఇతర కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని సమతుల్యం చేసుకోవాలి. 
 
పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. న్యూట్రీషియన్స్ కూడా ఎక్కువే. అందుకే డయాబెటిక్ పేషెంట్లు వాటర్ మెలోన్‌ను ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ సలహాల ప్రకారం పుచ్చకాయ ముక్కలను డైట్‌లో చేర్చుకోవచ్చు. శరీరంలోని చక్కెర స్థాయుల్ని నియంత్రించుకోవాలంటే.. ఒక కప్పు వాటర్ మెలోన్ తీసుకునే ముందు.. ఆహారాన్ని(కార్బొహైడ్రేట్స్ గల) కాస్త తగ్గించుకోవాల్సి వుంటుంది. అంటే అన్నం, ఇడ్లీలు, దోసెలు వంటి ఇతరత్రా ఆహారాన్ని కాస్త తగ్గించాలి. 
 
ఇంకా ఓట్ మీల్, తృణధాన్యాలతో పాటు పుచ్చకాయ తీసుకుంటే చక్కెర స్థాయుల్ని నియంత్రించుకోవచ్చు. చక్కెర స్థాయులు అధికమైతే.. కిడ్నీ సంబంధిత వ్యాధులు, హృద్రోగ సమస్యలు, గుండెపోటు వంటివి తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటర్ మెలోన్‌లో విటమిన్ ఎ, సీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. మధుమేహగ్రస్తులు దీనిని పరిమితంగానే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

మాంసం తినే విషయంలో గొడవ.. ప్రియురాలు ఆత్మహత్య

సరోగసీ కోసం ఆస్పత్రికి వచ్చిన మహిళ అనుమానాస్పద మృతి!!

రాంగోపాల్ వర్మపై 9 కేసులు.. అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి..

చపాతీ రోల్ గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments