అనారోగ్యాన్ని తెచ్చే అలవాట్లు... ఏంటవి?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (19:12 IST)
ఆరోగ్యానికి ఇది చేయండి అది చేయండి అంటుంటారు. కానీ అసలు అనారోగ్యాన్ని కలిగించే అలవాట్లు ఏమిటో తెలుసా? అవేమిటో ఒకసారి చూద్దాం. ప్రతిరోజూ స్నానం చేయకుండా వుండేవారికి అనారోగ్యం నీడలా వెన్నంటి వుంటుంది.
 
ఇంకా క్రమబద్ధం కాని భోజనం... అంటే రోజు ఒకేవేళలో భుజించకుండా వుండటమన్నమాట. అధిక ఉపవాసం, బజారులో దొరికే చిరుతిళ్లు, చల్లని పానీయాలు, పరిశుద్ధం చేయనటువంటి నీళ్లు తాగటం, ఎక్కువగా పులిసిన పదార్థాలు తినడం చేస్తే అనారోగ్యం కలుగుతుంది.
 
అలాగే వ్యాయామం తగినంత చేయకపోవడం, అతి బ్రహ్మచర్యము లేదా అతి సంభోగము, పగటివేళ నిద్ర, సరిగా దంతధావనం చేయకపోవడం, నాలుకపై వున్న పాచిని తొలగించకపోవడం, అతిగా తిరగడం వంటివి సమస్యను తెస్తాయి.
 
ఊక, కిరోసిన్, పెట్రోలు, డీజిల్, తారు, పొగాకు వంటి వాటి నుంచి వచ్చే పొగను పీల్చడం, కుళ్లిపోయిన కూరలు, మాంసం, పళ్లు సేవించడం, మురుగు కాల్వలకు సమీపంలో వుండటం, వస్త్రాలను బాగా బిగుతుగా ధరించడం, పరిశుభ్రమైన దుస్తులను ధరించకపోవడం, ఆకు కూరలు, పౌష్టికాహారం తీసుకోకపోవడం, విపరీతంగా ఆందోళన చెందటం ఆరోగ్యానికి చేటు చేస్తాయి. కనుక పైన పేర్కొనబడిన అలవాట్లను వదిలించుకుంటే అనారోగ్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రేయ్.... కొడకా, ఎందుకురా ఆ ఫోటోలు వేసావ్: జర్నలిస్టును కొట్టిన వీణ

వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంటే కమిటీతో కాలయాపనా?: డిప్యూటీ సీఎం పవన్‌కు రోజా ప్రశ్న

మధ్యప్రదేశ్‌లో పెరిగిపోతున్న ఆ సంస్కృతి.. ట్రాప్ చేయడానికి రెడీగా వున్న కేటుగాళ్లు

ప్రియుడి కోసం తల్లిదండ్రులకు విషం ఇంజక్షన్ ఇచ్చి చంపేసింది

భార్యను చంపేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి.. ఎందుకు చంపాడు.. ఏంటి సమాచారం?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: ఆకాశంలో ఒక తార లో సిగరెట్‌ తాగుతూ రఫ్‌ గా వుండే పాత్రలో శృతి హాసన్‌

Lakshmi Rai: లక్ష్మీ రాయ్ జనతా బార్.. త్వరలోనే హిందీ లో విడుదల

మొదటి సారిగా మనిషి మీద నమ్మకంతో శబార మూవీని చేశా : దీక్షిత్ శెట్టి

Yadu Vamsi: తెలుగమ్మాయి కోసం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సన్నాహాలు

Hreem: షూటింగ్‌ పూర్తి చేసుకున్న హారర్‌ థ్రిల్లర్‌ చిత్రం హ్రీం

తర్వాతి కథనం
Show comments