అన్ని రుచులను మితంగా సేవించేవారు ఆరోగ్యంగా వుంటారు. ఐతే ఇలాంటివారు కొన్నిసార్లు అతిగా కూడా తింటుంటారు. ముఖ్యంగా ఘాటుగా వుండే కారాన్ని అబ్బ.. అబ్బ అంటూ ముక్కు వెంట నీరు కారుతున్నా లాగించేస్తుంటారు. అయితే అతి ఎక్కువే అనర్థదాయకమే.
దేహానికి అవసరమైనంత మేరకు మాత్రం కారం తీసుకోవాలి. మితంగా తీసుకునే కారం వల్ల జఠరాగ్ని వృద్ధి చెంది తిన్న ఆహోరం శోషించబడుతుంది. జలుబు, శరీర వాపు, చెమట, దద్దర్లు మొదలైనవి పోగొడుతుంది. దురదలు, క్రిములను నాశనం చేయగల శక్తి కారానికి వుంది. ఐతే ఇలాంటి కారాన్ని మోతాదుకి మించి తీసుకుంటే చేటు జరుగుతుంది.
కారం మోతాదుకి మించి తీసుకునేవారిలో ఇంద్రియ వికారాలు అధికంగా సంభవిస్తాయి. మగతనానికి హాని కలుగుతుంది. బలహీనత, మూర్ఛ, మైకము మొదలగు వికారాలు కలుగుతాయి. అంతేకాదు, కారం తీసుకోవడం ఎక్కువయ్యేకొద్దీ గొంతు, కడుపులో మంటతో పాటు పలు ఆకస్మిక వ్యాధలు సంభవించే అవకాశం వుంది. కనుక కారాన్ని మితంగా తీసుకోవడం మేలు.