Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేపర్‌ కప్స్‌లో టీ తాగితే.. ఆరోగ్యానికి ముప్పే!

Webdunia
శుక్రవారం, 13 నవంబరు 2020 (17:53 IST)
డిస్పోజల్‌ పేపర్‌ కప్స్‌లో టీ తాగితే ఏంకాదని మనం అనుకుంటాం. కాని ఆరోగ్యానికి అసలుకే ముప్పట. అవి ఎంతమాత్రం సురక్షితం కాదని ఓ అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనాన్ని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), ఖరగ్‌పూర్‌ పరిశోధకులు నిర్వహించారు. ఒకరోజులో మూడు డిస్పోజల్‌ పేపర్‌ గ్లాస్‌లలో టీ తాగిన వారి శరీరంలోకి 75,000 చిన్న మైక్రోప్లాస్టిక్ కణాలు వెళ్తాయట. 
 
‘పేపర్‌ కప్స్‌లో టీ పోయడం వల్ల ఆ వేడికి లైనింగ్‌ కరుగుతుంది. అందులోని మైక్రోప్లాస్టిక్‌ కణాలు టీ లో కలిసిపోతాయని మా పరిశోధనలో తేలింది. పేపర్‌ కప్పులు సాధారణంగా పలుచని హైడ్రోఫోబిక్‌ ఫిల్మ్‌ పొరతో కప్పబడి ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్లాస్టిక్‌ (పాలిథిలిన్‌), కొన్నిసార్లు కో పాలిమర్లతో తయారుచేయబడతాయి. పదిహేను నిమిషాల్లో ఈ మైక్రోప్లాస్టిక్‌ పొర వేడికి కరుగుతుంది.’అని  అధ్యయనానికి నేతృత్వం వహించిన ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ సుధా గోయెల్ తెలిపారు. 
 
‘ఈ మైక్రోప్లాస్టిక్స్ అయాన్లు పల్లాడియం, క్రోమియం, కాడ్మియంలాంటి విషపూరిత హెవీ లోహాలు. ప్రకృతిలో హైడ్రోఫోబిక్ అయిన సేంద్రియ సమ్మేళనాలు లాంటి వాటికి క్యారియర్లుగా పనిచేస్తాయి. వీటిని తీసుకున్నప్పుడు ఆరోగ్య తీవ్రంగా నష్టం జరుగుతుంది.’ అని ఆమె వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments