Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐస్‌క్యూబ్స్‌తో గొంతుపై మర్దన చేసుకుంటే..?

Webdunia
శుక్రవారం, 30 నవంబరు 2018 (11:53 IST)
మంచు ముక్కలంటే ఐస్‌క్యూబ్స్. వీటిని వేసవిలోనే ఎక్కువగా వాడుతుంటారు. ఎందుకంటే.. చలికాలంలో ఈ ఐస్‌క్యూబ్స్ వాడితే అనారోగ్యాలు పాలవుతారని కొందరి నమ్మకం. ఐస్‌క్యూబ్స్‌లోని ప్రయోజనాలు తెలుసుకుంటే.. ఈ కాలంలో కూడా వీటిని వాడాలనిపిస్తుంది. అవేంటంటే..
 
1. దెబ్బలు తగిలినప్పుడు గాయాలపాలైన శరీరంపై లోదెబ్బలు తగులుతాయి. ఈ గాయాలు తొలగించాలంటే.. ఐస్‌క్యూబ్స్‌ని ఆ ప్రాంతాల్లో సుతిమెత్తగా రుద్దాలి. దీంతో దెబ్బ తగిలిన చోట రక్తం గడ్డకట్టే పరిస్థితి ఉత్పన్నం కాదు. నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని చెప్తున్నారు వైద్యులు. 
 
2. శరీరం కాలినప్పుడు వెంటనే ఐస్‌క్యూబ్ ఆ గాయంపై ఉంచి రుద్దితే మంట నుంచి ఉపశమనం కలగుతుంది. దీంతో గాయం త్వరగా మానుతుంది. 
 
3. గొంతులో కిచ్ కిచ్‌గా ఉంటే ఐస్‌క్యూబ్స్‌ని తీసుకుని గొంతుపై భాగంలో మెల్లగా రుద్దితే సమస్య నుండి విముక్తి లభిస్తుంది.  
 
4. కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటే.. నొప్పి ఉన్న చోట ఐస్‌క్యూబ్‌ను 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా ఎనిమిది నుంచి పదిసార్లు చేయాలి. ఇలా తరచుగా చేస్తే దీంతో నొప్పి మటుమాయం.
 
5. ముక్కునుండి రక్తం కారుతుంటే.. ఐస్‌క్యూబ్స్‌ను ఓ గుడ్డలో ఉంచి ముక్కుపై ఉంచండి. కాసేపట్లోనే ముక్కునుంచి రక్తం కారడం తగ్గి ఉపశమనం కలుగుతుంది. 
 
6. శరీరంలోని ఏదైనా భాగం బెణికితే ఆ ప్రాంతంలో వెంటనే ఐస్‌క్యూబ్ ఉంచితే వాపు రాదంటున్నారు వైద్యులు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments