టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? మాత్ర చేదుగా వుందనీ...

సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవపదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు చెపుతున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (14:52 IST)
సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం వాడుతున్న ద్రవపదార్ధాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని వైద్యులు చెపుతున్నారు. మాత్రలు మింగేందుకు తొలి నుంచి చేసుకున్న అలవాట్లు రీత్యా కాఫీ, టీ, పాలు, పళ్ళరసాలు లేదా నీళ్ళు వాడుతుంటారు. అయితే వీటన్నింటిల్లో నీళ్ళతో మాత్రం తీసుకోవడం క్షేమకరమని డాక్టర్లు చెబుతున్నారు. నీళ్ళు కాక ఇతర ద్రవపదార్ధాలు వాడటం మాత్రలు చేసే ప్రక్రియ భంగం కలిగిస్తాయని వారు చెపుతున్నారు. 
 
కాఫీ, టీలతో మాత్రల్ని తీసుకుంటే పలు సమస్యలను మనకు మనమే ఆహ్వానించినట్లు అవుతుందంటున్నారు. ఎందుకంటే ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫీన్‌ దెబ్బతీస్తుంది. పైగా సైడ్‌ ఎఫెక్టులు అధికం కావచ్చు. అంతేకాదు కెఫీన్‌ కడుపులో మంటను పెంచుతుంది. పాలల్లోని కాల్షియం యాంటీబయోటీస్‌ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. 
 
మామిడిపండు పీచుతో కూడిన పళ్ళరసాలు, లేదా కాయగూరల రసాలతో మాత్రలు తీసుకుంటే కొన్ని మందుల ప్రభావం తగ్గిపోతుంది. ద్రాక్షరసం తీసుకుంటే అందులోని ఎంజైమ్స్‌లు కొన్ని మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. గుండె జబ్బులకు ఉపయోగించే కొన్ని రకాల మందులు, యాంటీ ఫంగల్‌ మందులు పనిచేయక పోగా సైడ్‌ ఎఫెక్టులకు దారి తీయొచ్చని చెపుతున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

'కరీంనగర్ పిల్లా 143' పేరుతో భార్యాభర్తల గలీజ్ దందా ... ఎక్కడ?

దుబాయ్‌లో జనవరి 2026 శ్రేణి కచేరీలు, ఎవరెవరు వస్తున్నారు?

దేశంలో పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్

ఇద్దరు వివాహితలతో అక్రమ సంబంధం, కూడబలుక్కుని ప్రియుడిని చంపేసారు, ఎందుకు?

తిరుపతి కేంద్రం అతిపెద్ద రీసెర్స్ సెంటర్ : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మధిరలో కృష్ణంరాజు డయాబెటిక్ వార్షిక హెల్త్ క్యాంప్ ప్రారంభించనున్న భట్టివిక్రమార్క

Netflix: బిగ్గెస్ట్ స్టార్స్ తో 2026 లైనప్‌ను అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్

Manaswini: మనస్విని బాలబొమ్మల కొక్కోరోకో తో సినీ రంగ ప్రవేశం

Sara Arjun: విజయ్ దేవరకొండ నా ఫేవరేట్ హీరో - సారా అర్జున్

సారా అర్జున్ కాదంటే యుఫోరియా మూవీ తీసేవాడిని కాదు : దర్శకుడు గుణశేఖర్

తర్వాతి కథనం
Show comments