ధ్యానం చేస్తే బరువు తగ్గుతారా..?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (14:32 IST)
నేటి తరుణంలో వ్యాయమాలు, యోగాసనాలు, ధ్యానాలు చేసేవారు చాలా తక్కువగా ఉన్నారు. వీటిని చేయకపోతే ఊబకాయంతో బాధపడాల్సివస్తుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఊబకాయం కారణంగా బరువు విపరీతంగా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మరి ధ్యానాలు, యోగాలు చేస్తే బరువు తగ్గుతారో లేదో తెలుసుకుందాం...
 
ఇటీవలే ఓ యూనివర్సిటీలో చేసిన పరిశోధనలో మైండ్ రిలీఫ్ చేసే.. ధ్యానాలు, యోగాలు చేస్తే బరువు తప్పకుండా తగ్గుతారని తేల్చి చెప్పారు. రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే సూర్యుని ముందు కూర్చిని ఓ 10 నుండి 15 నిమిషాల పాటు ధ్యానం చేస్తే.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఆ రోజంతా ఏదో సాధించినట్టుగా అనిపిస్తుంది. వాకింగ్ చేస్తే, తిండి తగ్గిస్తే బరువు తగ్గవచ్చని కొందరు ఆలోచిస్తుంటారు.. కానీ, అది నిజం కాదని స్పష్టం చేశారు వైద్యులు.
 
బరువు తగ్గాలని తిండి తగ్గిస్తే.. శరీరం నీరసానికి లోనవుతుంది. దాంతో ఊబకాయం, శరీరంలో అధిక కొవ్వు ఏర్పడి అనారోగ్య సమస్యలు దారితీస్తుంది. కనుక ఎట్టిపరిస్థితుల్లో తిండిని మాత్రం ఎప్పుడూ మానేయకండి. మైండ్ రిలీఫ్‌తో ప్రతిరోజూ ధ్యానం చేసినవారు.. ఇతరులతో పోలిస్తే ఆరు నెలల కాలంలో అధిక బరువు తగ్గారని పరిశోధకులు గుర్తించారు.

వెయిట్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌‌లో పాల్గొంటున్న 53 మందిలో మైండ్ రిలీఫ్ ధ్యానంతో నాలుగు దశల్లో మూడింటిని పూర్తిచేసిన 33 మంది అధిక బరువును కోల్పోయి స్లిమ్‌గా మారారని అధ్యయనంలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

రాగి శాసనాలను స్వదేశానికి తెప్పించిన ప్రధాని మోడీ.. ప్రశంసించిన సీఎం విజయ్

మమతా బెనర్జీకి షాకిచ్చిన బరాసత్ ఎంపీ... అన్ని పదవులకు రిజైన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments