Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇబ్బంది పెట్టే బీపీ.. ఇలా అదుపు చేయవచ్చు...

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (21:37 IST)
ఈ రోజుల్లో రక్తపోటు సమస్య లేనివారు లేరంటే అతిశయోక్తి కాదు. దీన్ని నియంత్రించేందుకు మాత్రలు మింగుతుంటారు. ఐతే సహజసిద్ధమైన పద్ధతుల్లో అంటే... ఈ ఆహార నియమాల ద్వారా ఒక వ్యక్తికి 2,000 క్యాలరీలు సమకూరి 14 రోజుల్లో బీపీ నియంత్రణలోకి వస్తుంది.
 
గింజధాన్యాలు:
గోధుమ పిండితో తయారుచేసిన 7 బ్రెడ్ స్లైసులు లేదా 3 కప్పుల అన్నం లేదా ఉడికించిన ఇతర గింజ ధాన్యాలు లేదా ఓట్‌మీల్, ఆరు పుల్కాలు (సాధారణ సైజువి) లేదా 3 కప్పుల పాస్తా లేదా మొక్కజొన్న ప్రతిరోజు తీసుకున్నట్లైతే రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు.
 
కూరగాయలు:
ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు, ఒక కప్పు ఉడికించిన క్యారెట్లు, తక్కువ నూనెతో వండిన కూరలు, కూరగాయలతో చేసిన రెండు కప్పుల జ్యూస్. ఇలా 4-5 రకాల కూరగాయలు రోజూ భోజనంలో ఉండాలి.
 
పండ్లు:
పండ్లు కూడా రోజులో 4-5 రకాలు తీసుకోవాలి. 300 మి.లీ పండ్ల రసం, 1-2 అరటి పండ్లు, అన్నిరకాల పండ్ల ముక్కలు కలిపి తయారు చేసిన 2 కప్పుల సలాడ్, (బత్తాయి, పైనాపిల్, పుచ్చకాయ, బొప్పాయి).
 
వెన్నశాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తులు:
పావు లీటర్ పాలు, పావు లీటరు పెరుగు, 50గ్రా. చీజ్ లేదా పనీర్ వంటి ఉత్పత్తులను తీసుకోవాలి.
 
మాంసం:
కొవ్వులేని 150గ్రా. ఉడికించిన మాంసం; చేపలు
 
నట్స్:
రోజుకు బాదంపప్పు 15, పొద్దు తిరుగుడు గింజలు 15 తీసుకోవాలి.
 
తృణధాన్యాలు:
రోజుకు 150గ్రా.లు. రాజ్మా, శనగలు, పెసలు, కొవ్వు, నూనెలు: రోజుకు 20 గ్రా.లు.

సంబంధిత వార్తలు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

గుర్తుపట్టలేని విధంగా ఇరాన్ అధ్యక్షుడి మృతదేహం? అక్కడ తోడేళ్లు వున్నాయట

వారంలో ఎక్కువ రోజులు కెఫీన్ తాగుతున్న యువత..

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

తర్వాతి కథనం
Show comments