Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో మెంతుల పొడిని తీసుకుంటే ఎంత మేలు జరుగుతుందంటే?

మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించు

Webdunia
మంగళవారం, 29 మే 2018 (10:27 IST)
మెంతులు వంటకాలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇవి శరీరంలో వేడిమిని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మెంతుల్లో 50 శాతం పీచుపదార్థం ఉండడం వలన చక్కెర వ్యాధికి, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించుటకు సహాయపడుతుంది. మెంతులు ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే ఇలాంటి వ్యాధులనుండి దూరంగా ఉండవచ్చును.
 
మెంతుల్ని తీసుకోవడంతో పాటు రోజూ అరగంట వాకింగ్ చేస్తే బరువు తగ్గుటకు ఉపయోగపడుతుంది. శరీరానికి గల ఉదరసంబంధిత రుగ్మతలు ఏర్పడకుండా మెంతులు సహాయపడుతాయి. ఈ మెంతులకు పొడి చేసుకుని నీటిలో లేదా మజ్జిగలో కలుపుకుని భోజనానికి 15 నిమిషాల ముందు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. షురగ్ లెవన్‌ను కంట్రోల్ చేస్తుంది. అలాకాకుంటే వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని డ్రైన్డ్ చేసి ఆ మిశ్రమాన్ని చపాతీ, ఇడ్లీ, పొంగల్, పెరుగు, ఉప్మా వీటినన్నింటిలో వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. 
 
తల్లులకు పాల ఉత్పత్తిని పెంచేందకు మెంతులు చాలా ఉపయోగపడుతాయి. దీనిని ఎలా తీసుకోవాలంటే, మెంతులకు నెయ్యిలో వెయించి వాటిని బాగా నూరి ఆ చూర్ణానికి సమానంగా గోధుమ పిండిని కలిపి ఆ మిశ్రమంలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అలాలేకుంటే మెంతులతో చేసిని కషాయాన్ని, మెంతికూర పప్పును తీసుకుంటే కూడా మంచిది.
 
ఈ మెంతులను రోజు ఆహారంలో తీసుకుంటే గ్యాస్ సమస్యలు తొలగి జీర్ణక్రియకు సహాయపడుతాయి. మలబద్దకం తొలగిపోతుంది. నిమ్మరసంలో మెంతుల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం నుంచి విముక్తి చెందవచ్చును. గాయాలకు, పుండ్లకు, తామర, గజ్జి, ఎండవలన కందిపోయి చర్మం వంటి సమస్యలకు మెంతుల పొడిని తీసుకుంటే మంచిది. ఆ మెంతుల పొడిలో కొంచెం నీళ్లుపోసి పేస్ట్‌లా తయారుచేసుకుని మీ చర్మానికి రాసుకుంటే పైన తెలిపిన సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చును.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments