పట్టరాని కోపంతో ఊగిపోతుంటారు, ఆ కోపం ఏం చేస్తుందో తెలుసా?

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (23:00 IST)
పట్టరాని కోపంతో చాలామంది ఊగిపోతుంటారు. ఇలాంటి కోపం వల్ల దీర్ఘకాలిక శారీరక ప్రభావాలు పెరిగిన ఆందోళన, అధిక రక్తపోటు, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. కోపాన్ని సరిగ్గా వ్యక్తీకరించినట్లయితే, అది సానుకూల, ఉపయోగకరమైన భావోద్వేగం వుండి పోతుంది కాని ఆరోగ్య సమస్యలను తీసుకురాదు. కోపం అదుపు చేసుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాలలో క్రమమైన వ్యాయామం, విశ్రాంతి పద్ధతులు నేర్చుకోవడంతో పాటు కౌన్సెలింగ్ పద్ధతులు ఉన్నాయి.

 
కోపంలో తీసుకునే నిర్ణయాలు జీవితానికి చెడుపు చేస్తాయి. అర్థపర్థం లేని కోపాన్ని అవతలి వ్యక్తిపై ప్రదర్శించడం వల్ల సంబంధాలు తెగిపోతాయి. ఇంకా ఈ కోపం ఎన్నో.. ఎన్నెన్నో రకాలు వస్తుంటుంది. మనం కోరుకున్నది దొరక్కపోవడం. ఇష్టమైనది జరగకపోవడం, ఇష్టం లేనిది జరగటం, మాటకు మాట అందివ్వడం, చెప్పిన మాటలను ధిక్కరించడం.. అంచనాలు తప్పిపోవడం.. 

 
ఇలా ఒకటేమిటి.. కోప కారణాలు సవాలక్ష. అయితే కోపం రావడానికి గల కారణాలను అన్వేషించకుంటే మనకు కోపం తెప్పించిన పరిస్థితులను గురించి కూడా ఆలోచిస్తే మనం చిరాకు పరాకులను, మాట దూకుడుతనాన్ని కాస్తంతయినా అదుపులో ఉంచుకోవచ్చు.

 
కోపం వస్తే ఏమవుతుంది?
కొందరు కోపం వస్తే తమలో తాము బాధపడిపోయి గింజుకుంటారు. ఇంకా తగ్గకపోతే భోజనం మాని తమను తాము హింసించుకుంటారు. అయితే ఇలాంటి ప్రవర్తన వల్ల మీ కోపం వచ్చిందన్న సంగతి ఇతరులకు అర్థం కాకపోగా, కుటుంబీకులు బంధువులు, మిత్రులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. 

 
ఒకవేళ అర్థమైనా మీ వైఖరికి అలవాటు పడిపోయి సరేలెమ్మని వదిలేస్తారు. ఇది మీకు మరింత ప్రమాదకరం అవుతుంది. అందుకే కోపం వచ్చినప్పుడు దానికి కారకులైన వారి వద్దకు పోయి, మీ బాధను మీ ఆగ్రహాన్ని బయటపెట్టి అడిగేస్తే సగం బాధ తీరిపోతుంది. వారి సమాధానం మీ అంచనాకు భిన్నంగా ఉంటే... మీ కోప కారణమే తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. 

 
అలాగని కోపం వచ్చినప్పుడు కోపం తెప్పించిన వారితో మాట్లాడకుండా, చూడకుండా ఉంటే కాసేపటికి కోపం పోతుంది. అలాకాక, కోపం తెప్పించిన వారి గురించి ఇతరుల దగ్గర మాట్లాడితే మరికొన్నిసమస్యలు ఎదురవుతాయి. అందుకే కోపంతో ఉన్నప్పుడు దాని గురించి పరాయి వారి దగ్గర మాట్లాడే కన్నా మౌనంగా ఉంటే ఎంతో మంచిది.

 
కోపానికి పరిష్కారం ఏంటి?
కాలు జారితే తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం. ఒక్కోసారి కోపంలో ఏం మాట్లాడుతున్నామో మనకే అర్ధం కాదు. అందుకే కోపం వచ్చినప్పుడు ప్రతి మాటకు ముందు రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి.

 
కోపానికి అతిసులువైన విరుగుడు అంకెలను లెక్కపెట్టడమే. కోపం వస్తే ధీర్ఘంగా శ్వాసిస్తూ ఒకటి నుంచి పది అంకెలు లెక్కపెడితే క్రమంగా కోపం తగ్గిపోతుంది. ఆత్మన్యూనత భావం కలవారు ప్రతి విషయానికి కోపం తెచ్చుకుంటారు. ఇందువల్ల ఏ ప్రయోజనం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ఇందుకు పరిష్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడమే.

 
కొన్ని రకాల వ్యాధుల వల్ల కూడా మనుషులకు పిలువకుండానే కోపం వస్తుంది. ముఖ్యంగా ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇలాంటి కోపిష్టులపై సానుభూతి చూపి మంచి మాటలతో ఊరడించాలి. ఈ సారి ఎప్పుడైనా మీకు కోపం వస్తే.. అద్దంలో మొహం చూసుకోండి. కోపంలో మీ హావభావాలు ఎంత వికృతంగా ఉంటాయంటే.. వాటిని అద్దంలో చూస్తేచాలు... మరోసారి మీకు కోపం రమ్మన్నా రాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Live Cockroach in Heart: గుండెలో బతికే వున్న బొద్దింక.. అమెరికాకు వెళ్లిన పెద్దాయన.. ఎందుకు?

పరకామణి దొంగతనం కేసు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదికను సమర్పించిన సిట్

పెట్టుబడుల కోసం అమెరికాలో పర్యటించనున్న నారా లోకేష్

అత్తగారింట్లో అడుగుపెట్టిన అర గంటకే విడాకులు - కట్నకానుకలు తిరిగి అప్పగింత

Karnataka: 13 ఏళ్ల బాలికను చెరకు తోటలోకి లాక్కెళ్లి అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

Rashmika: 2025లో అత్యంత ప్రజాదరణగల తారలు, దర్శకులుగా రష్మిక మందన్నా, రిషబ్ శెట్టి ప్రకటించిన IMDb

Sholay 4K : సినీపోలిస్ ఇండియా స్వర్ణోత్సవాల కోసం షోలే 4K డిజిటల్‌ పెద్ద తెరపైకి

శ్రీలంకకు మానవతా సాయం... కాలం చెల్లిన ఆహారాన్ని పంపిన పాకిస్థాన్

డేట్స్ లేకపోయినా అడ్జెస్ట్ చేసుకుని అఖండలో నటించా : సంయుక్తా

తర్వాతి కథనం
Show comments