Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మగవారు 40 ఏళ్లు దాటిన తర్వాత...

మగవారు 40 ఏళ్లు దాటిన తర్వాత...
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (23:35 IST)
మగవారు 40 ఏళ్లు దాటిన తర్వాత శరీరంలో కొన్ని మార్పులు కనబడవచ్చు. అలాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా వుండాలి. అకస్మాత్తుగా బరువు కోల్పోయినా లేదా బరువు పెరిగినా, శరీరంలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా తెలియకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఉదాహరణకు మధుమేహం బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఇది కాకుండా, కొలెస్ట్రాల్, అనారోగ్య కొవ్వులు వేగంగా బరువు పెరగటానికి దారితీస్తాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్, కొలెస్ట్రాల్‌ని చెక్ చేస్తూ ఉండాలి.
 
 
కొన్నిసార్లు సమయానికి భోజనం చేయకపోవడం లేదా జీర్ణక్రియ సమస్యల వల్ల గుండెల్లో మంట అనిపిస్తుంది. గుండెల్లో మంట బలహీనమైన గుండె ఆరోగ్యానికి కారణం కావచ్చు. అలాగే తరచుగా తలనొప్పి సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే వయసు పెరిగేకొద్దీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఏ రకమైన తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని నివారించడానికి, ఖచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాల్సి వుంటుంది.

 
కీళ్ల నొప్పులుగా అనిపిస్తుంటే శరీరం రోజురోజుకూ బలహీనపడుతోందని అర్థం. ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే, సరైన సమయంలో చికిత్స పొందేందుకు వైద్యుడిని సంప్రదించాలి. అలాగే మూత్రాన్ని నియంత్రించడంలో సమస్య ఉంటే, రోజుకు చాలాసార్లు వాష్‌రూమ్‌కు వెళితే, ఇది ముఖ్యమైన హెచ్చరిక సంకేతం. అటువంటి పరిస్థితిలో, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

 
మెడ నుండి నడుము వరకు భరించలేని నొప్పి ఉంటే, వెన్నెముక ఎముకలు బలహీనంగా ఉండవచ్చని అర్థం. ఇది మన శరీరంలో ముఖ్యమైన భాగం. అందువల్ల, ఏ విధమైన అజాగ్రత్త లేకుండా ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వుండాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిల్లలలో కరోనా అనంతర సమస్యలు: ఎండమిక్ అంటే ప్రమాదం తక్కువ అని కాదు