Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పిల్లలలో కరోనా అనంతర సమస్యలు: ఎండమిక్ అంటే ప్రమాదం తక్కువ అని కాదు

పిల్లలలో కరోనా అనంతర సమస్యలు: ఎండమిక్ అంటే ప్రమాదం తక్కువ అని కాదు
, సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (20:24 IST)
కరోనా మూడవ వేవ్ ప్రస్తుతం భారతదేశంలో ఉధృతంగా వ్యాపిస్తుంది. అయితే, గత రెండు వేవ్‌ల మాదిరిగా కాకుండా ఈసారి అధిక సంఖ్యలో పిల్లలు కరోనావైరస్ బారిన పడుతున్నారు. పిల్లల సంరక్షణ కొరకు టీకాలు సిద్ధంగా లేవనే వాస్తవం పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. ప్రస్తుతం పిల్లల కోసం పలు టీకాలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా పిల్లలను సురక్షితంగా ఒకచోట నిర్బంధించలేము, ఎందుకంటే వారిని ఒంటరిగా ఉంచడం సురక్షితం కాకపోవచ్చు. ఒంటరిగా ఉంటే వారు తమను తాము చూసుకోలేరు.

 
ఈ పరిస్థితిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలను తిరిగి తెరవడం ఎంతవరకు సురక్షితమో ప్రభుత్వాలు పునరాలోచించాలి. స్పష్టంగా ఈ మూడవ వేవ్ సమయంలో టీకాలు వేయని పిల్లలు చాలా దుర్భలమైన స్థితిలో ఉన్నారు.

 
ఈ మూడవ వేవ్‌లో ఒమిక్రాన్ ద్వారా ప్రభావితమైన పిల్లల్లో ఆందోళన, విచారం విపరీత మనస్తత్వం, కోపతాపాలకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి. అనేక మంది కరోనా ప్రభావిత పిల్లల మానసిక సమస్య, సరిగ్గా మాట్లాడలేకపోవడం, శ్రద్ధ లోపం, కదలిక, ఎదుగుదల లోపాలు కూడా కనిపిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

 
విజయవాడలోని కామినేని హాస్పిటల్స్‌లోని పిల్లల వైద్యుడు డాక్టర్ వెల్చూరి చంద్ర శేఖర్ మాట్లాడుతూ, “మల్టీసిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ (MISC-s) అనేది కోవిడ్-19 తర్వాత పిల్లలలో వచ్చే అరుదైన, తీవ్రమైన సమస్య. MIS-C పరిస్థితితో బాధపడుతున్న పిల్లలు గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మూత్రపిండాలు, జీర్ణవ్యవస్థ, మెదడు, చర్మం మరియు కళ్ళతో సహా శరీరంలోని వివిధ అవయవాలలో తీవ్రమైన మంటతో బాధపడుతున్నారు” అని తెలిపారు.

webdunia
"పిల్లలలో ఆరోగ్య సమస్యలు అన్ని ఆసుపత్రులలో ప్రధాన ఆందోళనగా మారాయి. కరోనా తర్వాత దశలో కొంతమంది పిల్లలకు మధుమేహం ఉన్నట్లు కూడా నిర్ధారణ అయింది. ఏది ఏమైనప్పటికీ, ఈ వైరస్ మధుమేహానికి కారణమవుతుందా లేదా వైరస్ ఇప్పటికే అనుమానాస్పదంగా ఉన్న పిల్లలలో మధుమేహాన్ని ప్రేరేపిస్తుందా అనేది స్పష్టంగా తెలియడానికి తగినంత అధ్యయనాలు ఇంకా జరగలేదు. కాబట్టి, ఈ దశలో తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండాలని మరియు వారి పిల్లల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి” అని డా. చంద్ర శేఖర్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమనీయమా కలువ రేకుల నయనతరంగమా