Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెమట కంపును తరిమికొట్టే తేనె.. ఎలాగో తెలుసా?

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (12:46 IST)
శరీరం నుండి చెమట వలన వచ్చే దుర్వాసనతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. పొద్దున శుభ్రంగా స్నానం చేసినా కూడా ఎండ వలన మధ్యాహ్నం వచ్చే చెమట దుర్వాసనను కలుగజేస్తుంది.

డియోడరెంట్లు వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అలాంటి వారు ఈ చిట్కాలను పాటించి చూడండి మార్పు మీకే తెలుస్తుంది. ఒక టేబుల్ స్పూన్ తేనెను బకెట్ నీళ్లలో కలిపి, ఆ నీటితో స్నానం చేస్తే చెమట కానీ, చెమట వాసన కానీ మీ దరిచేరదు. 
 
వేసవిలో కాటన్ దుస్తులను ఎక్కువగా ధరించడం వల్ల శరీరానికి బాగా గాలి తగిలి దుర్వాసన రాకుండా ఉంటుంది. టీ, కాఫీలు త్రాగితే చెమట ఎక్కువగా పడుతుంది. కాబట్టి చెమట వాసన నుంచి తప్పించుకోవడానికి టీ, కాఫీలను తక్కువగా తీసుకోండి. 
 
మంచి డైట్‌ను పాటిస్తే శరీరం దుర్వాసన రాకుండా ఉంటుంది. ఆహారంలో 20 శాతం మాంసకృతులు, 20 శాతం నూనెలు, కొవ్వు పదార్థాలు, పండ్లు ఉంటే చెమటను దూరం చేయవచ్చు.

స్నానపు నీటిలో ఉడికించిన పుదినా ఆకులను వేసి స్నానం చేస్తే చర్మం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది. సోంపు గింజలు నోటి దుర్వాసననే కాదు శరీర దుర్వాసనను కూడా పోగొడుతాయి. ప్రతిరోజూ ఒక స్పూన్ సోంపు గింజలను తింటూ ఉంటే మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

మోహన్ బాబుకు ఏడాదిపాటు 50 ఏళ్ల వేడుకలు చేయనున్న మంచు విష్ణు

బాబు - లోకేశ్ మార్ఫింగ్ ఫోటోలు : రాంగోపాల్ వర్మపై మరో కేసు

తర్వాతి కథనం
Show comments