Webdunia - Bharat's app for daily news and videos

Install App

పండుగ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండేందుకు సోహా అలీఖాన్‌ ఏం చేస్తుంటుందో తెలుసా?

Webdunia
సోమవారం, 30 నవంబరు 2020 (20:25 IST)
ఆహార ఎంపికలో ఆప్రమత్తంగా ఉండటం సోహా అలీఖాన్‌కు అత్యంత ప్రాధాన్యతాంశంగా ఉంది. ఈ నటి, ఎల్లప్పుడూ స్థిరంగా జీవించడంతో పాటుగా ఆరోగ్యవంతమైనదే తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. చిన్నతనం నుంచి తనలో తాను ఈ అంశాల పట్ల ఎంతగా శ్రద్ధ చూపుతుంటారో తరచుగా ఆమె మాట్లాడుతుండటం కూడా మనం చూడవచ్చు. తనలో ఆరోగ్యం మరియు పౌష్టికాహారం పట్ల శ్రద్ధ కలిగేందుకు తన తల్లి షర్మిలా కారణమని చెప్పే సోహా, చిన్నతనం నుంచి ఈ అభిరుచి పెరుగుతూనే ఉందని వెల్లడిస్తున్నారు.
 
పండుగ సీజన్‌కు మనం చేరువవుతున్న వేళ, తియ్యందనాలతో పాటుగా మరియు రుచికరమైన, ఆహ్లాదకరమైన విషయాలు మన చుట్టూ ఉంటాయి. అతిగా ఆ పదార్థాలను తీసుకోవాలనే కోరికా చాలామందిని అనియంత్రితంగా మార్చుతుంది. ఈ పండుగ సీజన్‌లో తనను ఆరోగ్యంగా, ఫిట్‌గా మార్చేందుకు సహాయపడే పౌష్టికాహార ప్రాధాన్యతలను గురించి సోహా ఇలా పంచుకున్నారు.
 
బాదములతో స్మార్ట్‌గా స్నాక్స్‌ తీసుకోండి:
సమాచారయుక్త ఆహార ప్రాధాన్యతలను తీసుకోవడానికి చక్కటి ఆరంభం ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకోవడం. నా వరకూ అయితే స్నాకింగ్‌కు తొలి ప్రాధాన్యత బాదములు. ప్రతిరోజూ బాదములతోనే నా రోజు ఆరంభం అవుతుంది. నా చిన్నతనం నుంచి ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాను. నా ఆహారం మరియు స్నాకింగ్‌ ప్రాధాన్యతల పట్ల నేనెప్పుడూ అప్రమత్తంగానే ఉంటాను. ఇప్పుడు మా అమ్మాయి నన్ను ఓ రోల్‌ మోడల్‌గా చూడటమే కాదు, నేను ఆచరిస్తున్నట్లుగానే ఆహారపు అలవాట్లనూ చేసుకుంది.
 
అందువల్ల, నేను ఇంటిలో ఉంచుకునే స్నాక్స్‌ పట్ల మరింత అప్రమత్తంగా ఉంటుంటాను. నేనెప్పుడూ కూడా బాదములను ప్రొటీన్‌లకు వనరుగానే భావిస్తాను. శక్తిని అందించే పౌష్టికాహారంగా మాత్రమే కాదు మజిల్‌మాస్‌ నిర్వహణకు, వాటి వృద్ధికీ తోడ్పాటునందిస్తుంది. వీటితో పాటుగా బాదములు అతి సులభంగా, వేగంగా రుచిని అందించడంతో పాటుగా ఏదైనా భారతీయ మసాలా/స్పైసెస్‌తో అతి సులభంగా కలిసిపోయి, రుచినీ అందిస్తాయి. అందువల్ల , మీకు దగ్గరగా గుప్పెడు బాదములను ఉంచుకున్నట్లయితే, ఆరోగ్యం పట్ల అస్సలు రాజీపడాల్సిన అవసరం లేదు.
హైడ్రేట్‌గా ఉండండి
పండుగ సీజన్‌ వేళ, తాము తీసుకునే మంచినీటి పరిమాణం పట్ల అప్రమత్తంగా ఉండటం కష్టసాధ్యమైన అంశమే కానీ, శక్తిస్థాయిలను నిర్వహించడమూ అంతే ముఖ్యమని గ్రహించాలి. అందువల్ల, నేను నా రోజును నిమ్మరసం లేదంటే మెంతి నీటితో ప్రారంభిస్తాను. అవి నాకు తాజాదనపు అనుభూతులను అందించడంతో పాటుగా, శక్తినీ అందిస్తాయి. అదనంగా, ప్రతి రోజూ పగటి పూట కనీసం 2 నుంచి 3 లీటర్ల నీటిని త్రాగడంతో పాటుగా తాజా పళ్లరసం, స్మూతీలు, సిట్రస్‌ జోడించబడిన నీరు, కొబ్బరి నీరు లేదా చ్చాచ్‌ వంటివి తాగుతూనే ఉంటాను. ఇవి నేను తాజాగా ఉండేందుకు, రోజంతా శక్తితో ఉండేందుకు తోడ్పడతాయి.
 
శ్రద్ధగా వ్యాయామం చేయాలి
పండుగలు తమతో పాటుగా స్వీట్లు, తియ్యందనాలను సైతం అధికంగానే తీసుకువస్తాయి. అవి నా బరువు మీద కూడా ప్రభావం చూపుతాయి. దీనిని నిరోధించడానికి, పండుగ సమయాలలో కూడా వ్యాయామాలను తప్పనిసరిగా చేయడానికి సమయం కేటాయించుకుంటుంటాను. సాధారణంగా నేను సాయంత్రం పూట వ్యాయామం చేస్తుంటాను. కానీ , పండుగ సీజన్‌లో నేను యోగా మరియు మెడిటేషన్‌లను ఉదయం పూట చేస్తుంటాను. అదీ, పండుగకు సిద్ధమవుతున్న వేళ లేదా మా అమ్మాయిని సిద్ధం చేయడం ఆరంభించక మునుపే ఇది చేస్తాను.
 
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల నుంచి ఒక గంట పాటు వ్యాయామాలు చేయడానికి నేను సమయం కేటాయిస్తుంటాను. అది ఎలాంటి పరిస్థితులలో ఉన్నా సరే. ఇది నా ఆరోగ్యం మరియు ఫిట్‌నెస్‌ చక్కగా ఉండేందుకు దోహదపడుతుంది. అత్యంత రద్దీ జీవితంలో కూడా శక్తివంతంగా మారుస్తుంది. పండుగ వ్యాయామం మరింత వినోదాత్మకంగా, ఎంగేజింగ్‌గా ఉండేందుకు, నేను కొన్నిసార్లు ఫ్యామిలీ యోగా సెషన్లు కూడా చేస్తుంటాను. లేదంటే మా శ్రీవారితో కలిసి వర్కవుట్స్‌ చేస్తుంటాను. అందువల్ల పండుగ సమయాలలో కూడా ఇద్దరమూ మోటివేట్‌ కావడంతో పాటుగా ఫిట్‌గానూ ఉంటుంటాము.
 
ఆరోగ్యవంతమైన జీవనశైలిలో, మీతో పాటుగా మీ కుటుంబం కోసం కూడా ఆరోగ్యవంతమైన ఎంపికలూ ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఈ ఎంపికలు మరియు ప్రయత్నాలు, ఆరోగ్యవంతమైన బరువు, సంతోషకరమైన హృదయం, జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా ఉండటం వంటి ప్రయోజనాలనూ అందిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రాత్రి బోయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లింది, తెల్లారేసరికి శవమై కనబడింది, ఏమైంది?

Madhya Pradesh: ఏకలవ్య స్కూల్ ప్రిన్సిపాల్, లైబ్రేరియన్‌.. ఇద్దరూ జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు..(video)

వీడి దుంపతెగ... లైవ్ కాన్సెర్ట్‌లోనే కానిచ్చేశాడు.. (Video)

జస్ట్.. 4 రోజుల్లో పాకిస్థాన్ ఫినిష్.. కరాచీలో గురుకులాలు నిర్మించాల్సి వస్తుంది : రాందేవ్ బాబా

A Raja: డీఎంకే ఎంపీ ఎ రాజాకు తప్పిన పెను ప్రమాదం.. ఆ లైటు ఎంపీపై పడివుంటే? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

రజనీకాంత్ రిటైర్మెంట్ చేస్తారంటే... కామెంట్స్ చేసిన లతా రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments