Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆరోగ్యానికి యోగా, వేసే ముందు ఇవి తెలుసుకోవాలి

ఆరోగ్యానికి యోగా, వేసే ముందు ఇవి తెలుసుకోవాలి
, గురువారం, 26 నవంబరు 2020 (21:30 IST)
ఇప్పుడు ప్రతి ఒక్కరూ వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. అందువల్ల ప్రతి రోజు యోగాకు గంట సమయం కేటాయించండి. దానిలో అరగంట ఆసనాలకు, పది నిమిషాలు ప్రాణాయామం, ఇరవై నిమిషాలు ధ్యానంకు కేటాయించుకుంటే మంచి ఫలితాలను చూస్తారు. 
 
ఆసనాలు వేస్తున్నాం కదా.. అని ఇప్పటికే మీరు వాడుతున్న మందులు, వైద్యులను సంప్రదించటాన్ని మాత్రం మానకండి. తర్వాత ఆసనాలు వేసే విషయంలో మీకు ఏ ఇబ్బంది వచ్చినా దగ్గరిలోని యోగ మాష్టారును సంప్రదించి ఆసనాలను మీరు సరిగా వేస్తున్నారో లేదో నిర్ధారించుకోండి. ఆసనాలు వేసే ముందు మనం కొన్ని అంశాలను పాటించాల్సివుంది.
 
1. ఎనిమిది నుంచి 60 సంవత్సరాల వాళ్లు మాత్రమే యోగా చేయాలి. 
2. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాతే యోగాసనాలు వేయాలి. 
3. ఆసనాలు వేసే ముందుగా గోరు వెచ్చటి నీటితో స్నానం చేయడం మంచిది. 
4. తెల్లవారుజామునే ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణ శక్తి ఎక్కువగా వుంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి.
5. శబ్దాలు, గోలలు లేకుండా వుండే ప్రదేశాన్ని ఎన్నుకోండి. 
6. పలుచటి బట్ట నేలపై పరిచి పద్మాసనం లేదా సుఖాసనం లేదా మీకు ఇష్టమైన ఆసనాన్ని వేయండి. 
7. ప్రశాంతంగా కనులు మూసుకోండి. 
8. మీ ధ్యాస శ్వాసమీదే నిలపాలి. 
9. గాలి వదిలినప్పుడు పొట్ట లోపలకు, పీల్చినపుడు ముందుకు వస్తుందో లేదో గమనించండి. (దీనికై, పొట్ట ద్వారా కాకుండా, ఛాతీ ద్వారా గాలి పీలుస్తుంటే మాత్రం మీ శ్వాస సరి కాదని గుర్తించాలి.)
10. ఆసన ప్రారంభ సమయంలో పద్మాసనం, వజ్రాసనం ఏదైనా వేయండి.
11. ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వేయాలి. ఏమాత్రం తొందర పడొద్దు. 
12. వేసిన ఆసనంలో కొద్ది సెకన్ల పాటు అలాగే వుండాలి. 
13. ఆసనం వేసేటపుడు ఎంత నెమ్మదిగా వేస్తామో అంతకంటే నెమ్మదిగా మామూలు స్థానంలోకి రావాలి. 
14. కుంభకం వేసేటపుడు అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం పది సెకన్లు మాత్రమే వేయాలి. 
15. గాలి పీల్చటం, వదలటం వంటి ఆసనాల్లో పైకి శబ్దం వచ్చేలా వదలటం, పీల్చటం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి.
16. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాస పడుతూ చేయకండి. మీ శరీర సామర్థ్యాన్ని గుర్తించి అంత సేపే ఉండండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ వ్యతిరేక ఊబకాయం రోజు, ప్రతిరోజూ ఇలా చేస్తే ఊబకాయానికి చెక్